కామాంధుడి కిరాతకాలు 17
telugu stories kathalu novels కామాంధుడి కిరాతకాలు 17 "అతను నా కళ్ళలోకి లోతుగా కొంచెం తేడాగా చూడగానే.. నేను ఏ రియాక్షన్ లేకుండా అలా చూస్తూ ఉండిపోతున్నాను. అతను కాఫీ ఆఫర్ చేస్తాడు, ఏదో అడుగుతాడు, ఇంకేదేదో మాట్లాతాడు. బట్ అవి నాకు తెలియడం లేదు.." గడగడా చెప్పింది మనీష."అంటే.. అతడు ఏం మాట్లాడినా, ఏం చేసినా నీకు అస్సలు తెలియట్లేదా..!?" రెట్టిస్తూ అడిగాడు ఆయన."సేమ్ మినిట్‌లో తెలియలేదుగానీ, కొంచెం సేపటి తర్వాత తెలుస్తుంది.."ఆమె మాటలు వినగానే గట్టిగా నవ్వారు కృష్ణమూర్తి. ఆయన అలా నవ్వడం ఈ మధ్య కాలంలో అసలెప్పుడూ జరగనట్టుగా లోపలి గదిలోంచి పనమ్మాయి కంగారుగా పరిగెత్తుకు వచ్చింది.నవ్వుతూ నవ్వుతూ గొంతు బొంగురుపోయి ఒక్కసారే గట్టిగా దగ్గాడాయన. టీపాయ్ మీదున్న స్టీల్ వాటర్‌బాటిల్ ఇచ్చింది మనీష.రెండు గుక్కలు నీళ్ళు తాగి గొంతు విప్పాడు. "మీ ఇద్దరిదీ లవ్ ఎట్ ఫస్ట్ సైట్ బేబీ. నువ్వూ వయసులో ఉన్నావు కదా. ఇంకొన్ని రోజులు గడిస్తే అంతా సర్దుకుంటుందిలే.."ఆయన తనని టీనేజ్ పిల్లలా ట్రీట్ చేస్తున్నాడనిపించింది."సర్.. నేనొక డాక్టర్ని. లవ్ గురించి, ఎట్రాక్షన్ గురించి నాకు ఐడియా ఉంది, ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. అవి వేరే విషయాలు. కానీ ఈ విషయం చాలా డిఫరెంట్