జీవన మాయ 2
telugu stories kathalu novels జీవన మాయ 2 ఇంటికొచ్చేవరకూ మౌనంగానే ఉన్న శాంత ఇంటి తలుపులుకూడా తీయకుండా అరుగుమీదే కూలబడింది. "నాన్నా...! ఆడవాళ్ళు స్మశానానికి ఎందుకు వెళ్ళకూడదు..? అదంత ఘోరమైన తప్పా..?" ఆలోచిస్తూనే అడిగిందామె. ఆమెకి ఇన్నాళ్ళుగా అడగాలని కూడా తోచని ప్రశ్న అది. చిన్నప్పుడు తండ్రితో 'వస్తా..'నని మారాం చేస్తుంటే, 'ఆడవాళ్ళు అక్కడికి రాకూడదమ్మా...' అని ఆయన చెప్పినప్పుడు కూడా అడగాలనిపించని ప్రశ్న అది.
"మన పురాణాల్లో ఎవరో పెద్దోళ్ళు రాశారంట. ఆడాళ్ళెవరూ కాటికాడకి రాకూడదని.." ఇంటి తలుపులు తీస్తూ అన్నాడు చలమయ్య.
"మరి ఆడాళ్ళనీ అదే కాటికెందుకు తీస్కెళ్తున్నారు నాన్నా...?" అర్థంకానట్టు అడిగిందామె.
"చనిపోయాక కదరా తీసకెళ్ళేది..." కూతురికి సమాధానం చెప్పాడు చలమయ్య.
"చనిపోతే ఆడవాళ్ళు ఆడవాళ్ళు కాకుండా పోతారా నాన్నా...?" వెంటనే అందామె.
శాంత వంక వింతగా చూస్తూ అయోమయం నిండిన ఆలోచనలో పడ్డాడు చలమయ్య.
* * *
రోజులు మామూలుగానే గడుస్తున్నా కొందరికి త్వరగా గడుస్తున్నట్టూ, ఇంకొందరికి సమయమే గడవనట్టూ అనిపించడం ఎవరి మాయో...!
అన్నీ మారుతున్నాయి. కొద్దో గొప్పో ఊళ్ళోనూ మార్పులొచ్చినా అవన్నీ కళ్ళకైనా అగుపడని ఊరిచివరి ఇల్లు చలమయ్యది.
సుగుణ బి.కాం. ఫస్టుక్లాసులో పాసయ్యింది. ఎవరో తెచ్చిన పక్కూరి సంబంధం... మంచి చెడులు మాట్లాడ్డం