జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయాణం 320
rebus-dm.ru telugu sex stories జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయాణం 320 11 గంటలకల్లా పెళ్లి జరిగే ప్రదేశానికి చేరుకొని కిందకు దిగుతుండగా కృష్ణ గాడు కారులో అప్పుడే రాగా , రేయ్ నువ్వు ఎప్పుడు బయలుదేరావు ఎప్పుడు వచ్చావురా అని ఆశ్చర్యంగా అడుగగా , తడబడుతూ వచ్చి నన్ను బుజ్జగిస్తున్నట్లుగా పిల్లలు ఐస్ క్రీమ్ అడిగారు అందుకే తినిపించి వస్తున్నాను అని చెప్పగా , కృష్ణవేణి ముసిముసి నవ్వులు నవ్వుతూ మహివాళ్ళ దగ్గరకు వెళ్లిపోగా , చిన్నా , రాము మీకోసం మరొక ఫ్రెండ్ వచ్చాడు అంటూ దింపి అన్వేష్ ను ఇద్దరికీ పరిచయం చెయ్యగా ముగ్గురూ friendship బాండ్ లాగా చేతులు కలిపి పేర్లు చెప్పుకుంటుండగా ,
మా అందర్నీ చూసి మావయ్య గారు సంతోషంతో మాదగ్గరకు రాగా మావయ్య అంటూ నేను , కృష్ణ , దివ్యక్క ఆశీర్వాదం తీసుకోబోగా వారించి , ఏంటమ్మా కోడలా పెళ్లి మండపం చూడటానికి వచ్చావా రామ్మా చాలా ఆనందంగా ఉంది , అరెరే నా కూతుళ్లు , కొడళ్ళూ చాలామంది వచ్చారే ముందు రండి లోపలకు అంటూ ఆహ్వానించగా , 90 పర్సెంట్ పనులు పూర్తయినట్లుగా చుట్టూ సెట్టింగ్ లతో కలకళలాడుతుండగా , ఓకేదగ్గర చంద్ర మరొక దగ్గర గూడెం పెద్దయ్య మరియు చాలామంది గూడెం వాసులు పనులలో సహాయం చేస్తుండగా ముందుగా పెద్దయ్య దగ్గరికి కృష్ణతోపాటుగా వెళ్లగా , నా అల్లుళ్ళు పనులలో మునిగిపోతారు మీకు మొత్తం నేను చూపిస్తాను అంటూ ముందుగా అదిరేటి సెట్టింగుతో అద్భుతంగా దర్శనమిస్తున్న దగ్గరకు పిలుచుకొనివెళుతుండగా ,
పెద్దయ్యా గూడెం అన్నలంతా ఇక్కడే ఉన్నట్లున్నారే అని ఆశ్చర్యపోతుండగా , వాసంతితో పాటు అమ్మవాళ్ళు పెళ్లికి ఆహ్వానించినప్పటి నుండి పెద్దయ్యా మనం ఎలాగైనా సహాయం చెయ్యాలి అని వీళ్లంతా నిర్ణయించుకోగా నిన్న వాసంతిని కలవగా జరుగుతున్న పనుల గురించి చెప్పగా పనులు