ఇంట్లో మొగుడు.. ఆఫీసులో పెళ్ళాం
rebus-dm.ru telugu sex stories ఇంట్లో మొగుడు.. ఆఫీసులో పెళ్ళాం మా ఆవిడ సునందకు ప్రభుత్వోద్యోగముంది. అయితే నేనేం తక్కువకాదు కమర్షియల్ ఆర్టిస్ట్ ని. అవసరమైనప్పుడు తెలుగు పత్రికల్లో కథలకు, సీరియళ్ళకూ బొమ్మలు గీసి పంపించటం... యాడ్స్ ఏజన్సీవాళ్లు లోగోలు గట్రా అడిగితే వేసి పెట్టడం చేస్తుంటాను ఇంటిదగ్గరే పండుగల సీజన్ అయితే గ్రీటింగ్ కార్డ్ ల పనీ వుంటుంది. ఇవన్నీ చేస్తున్నా భార్యామణితో సమానంగా లేదా తక్కువ సమానంగా (రాధాగోపాలం చిత్ర దర్శకులు బాపుగారికి క్షమాపణలు) సంపాదిస్తున్నా ఓ చిన్నఅసంతృప్తి. సునంద ఉదయం తొమ్మిది గంటలకు "తలుపు వేసుకోండి. జాగ్రత్త" అని చెప్పి వెడుతూండటం, నేను ఇంట్లోనే ఉండటం... నా టాలెంటు గొప్పతనం దేవుడెరుగు. "ఆవిడ ఉద్యోగం చేస్తుంది. మొగుడు ఇంట్లోనే వుంటాడు' అనేది చాలాకాలం ఆ ఆపార్ట్మెంట్లో 'చర్చాకా విషయ్’ అయి కూర్చుంది
వాషింగ్ మిషన్ ఆఫ్ చేసి బట్టలు బాల్కనీలో ఆర వేయడం, కిచెన్ లో పనులు చేస్తున్నప్పుడు, మిక్సీ అరచినప్పుడు కొన్ని ప్లాట్ల వాళ్ళ దృష్టి పడడం సహజం. ఆ తరువాత మేమే హాట్ టాపిక్ గా మారడం ఇబ్బందికరం. “ఏం చేస్తాం. మన ఇళ్లు మన ఇష్టం' అనేది సునంద "నా మొగుడు నా ఇష్టం' అనకుండా.
"పత్రికల కథల బొమ్మల సంగతి నాకనవసరం. నాకు మాత్రం ఒక డజన్ గ్రీటింగ్ కార్డులు కావాలి. పోయినేడు మా బాస్ కూతురు బర్త్డే కు ఇస్తే చాలా ఇంప్రెస్ అయ్యారు. మిమ్మల్ని చాలా పొగిడారు. ఆయన అడిగారు... అందుకు" అని ఆర్డరు జారీచేసేసి ఆఫీసుకు వెళ్ళిపోయింది.
ఆ పనిలో పడిపోయాను.
డోర్ బెల్ మ్రోగింగి.
వెళ్ళి తలుపుతీశాను.
టీ షర్ట్, టైట్ కిల్లర్ జిన్స్ వేసుకున్న ఓ పొడు గాటి అందమైన శిల్పాశెట్టిలాంటి అమ్మాయి. ఆ టీ షర్ట్ మీద నా దృష్టి వాలింది. "అయామ్ ఫ్రీ' అని వుంది.
"హాయ్" అంది. అని ఊరుకోలేదు. నవ్వింది కూడా.
నవ్వు బావుంది. అయినా నవ్వితే ఎవరైనా బావుంటారు. అది వేరే విషయం.
నేను బదులు ఇవ్వలేదు. ఇవ్వలేకపోయాను. ఆమెనలాగే రెప్పవేయకుండా చూస్తుండిపోవడం వల్ల.
"మిస్టర్ సంపత్"
"నా పేరు మీకు..."
"తెలుసు. క్రింద సెల్లార్ లో ప్లాట్ నంబర్లు.. పేర్లు"
"అవి ఓనర్లవి. మేం టెనెంట్స్ కావచ్చుగా"
"ఛాన్స్ తీసుకున్నాను. కాకపోతే