ఐదుగురు మిత్రులు 3
ఇద్దరం బెంగళూరు లో వాళ్ళ అక్క ఇంట్లో దిగాం. రేడీ అయ్యి కాలేజి అడ్డ్రస్సు గూగుల్ మ్యాప్స్ లో చూసుకుని వాళ్ళ బావ బైక్ మీద ఇద్దరం బయలుదేరాం. కాలేజి సిటీ కి దూరం గానే వుంది. సిటీ ట్రాఫిక్ దాటుకుని ఆ పచ్చని పొలాల మధ్యన అందమైన అమ్మాయి తో వేళ్తుంటె భలే వుంది. సుమ వుండుంటే బాగుండనిపించింది. ఇంతలో అను ఇలా అంది
అను: ఏంట్రా నిన్న రాత్రి నేను చేసిన దానికి కోపం వచ్చిందా. సరిగ్గా మాట్లాడట్లేదు?
నేను: లేదు నీ పరిస్థితి అర్ధం చేసుకున్నా లే. నాకు మొదటి సారి కదా. కంట్రోల్ అవ్వలేదు. చిన్నప్పటి నుండి కలిసి పెరిగాం ఏమో. ఆ చనువు వల్ల అంత దూరం వెళ్ళిపోయాను. నీ పరిస్థితి లో ఇంకో అమ్మాయి వుంటే అలా ప్రవర్తించే వాడినా?
అను: లేదులే నీ గురించి నాకు తెలియదా (అని వెనుక నుంచి ప్రేమగా ఒక సారి హగ్ చేసుకుంది). ఏమో రా మన మధ్య లో ఇలాంటి పరిస్థితి వస్తుందని అస్సలు అనుకోలేదు. భయం వేసింది. ఎవ్వరికి చెప్పకు ఇలా జరిగిందని.
నేను: మన వర్మ గాడికి తెలిస్తే గుండాగి చస్తాడు పాపం వెధవ. (ఇద్దరం నవ్వులు)