ఇదీ కధ 18

By | December 1, 2019
telugu stories kathalu novels books ఇదీ కధ 18  "ఆ ప్రెషర్ కుక్కర్ దొరికిందా?" సాగర్ ఆశ్చర్యనికి అవధులు లేవు. 'అవును దొరికింది బాబూ!" "ఎప్పుడూ" "అది పోయిందని మాధవమ్మగారూ ఎంత హాడావుడి చేశారు చూడండీ! ఆ తర్వాత మూడు రోజులకు దొరికింది." "ఎవరు చూశారు?" "ఎవరేమిటి బాబు! నేనే చూశాను. ఇరిగి పోయిన బెంచీ ముక్కలు కుర్చీ ముక్కలు పొయ్యి కిందకు తీసుకుందామని ఆ కుప్ప కదిలించాను. అక్కడే దొరికింది." "ఆ తర్వాత ఏం చేశావ్?" "ఏం చెయ్యడానికి ఏముంది బాబూ! అయ్యగారి కిచ్చి జరిగింది చెప్పాను." "ఈ సంగతి మాధవికి తెలుసా? ఇప్పుడా కుక్కర్ ఎక్కడున్నది?" "ఆ కుక్కర్ గిన్నె అమ్మాయిగారి కళ్ళ పడకుండా దాచేయమన్నారు. ఇప్పుడది నా దగ్గరే వున్నది. అది ఏం మాయదారి గిన్నో బాబు అది మా ఇంట్లోకి వచ్చినప్పటి నుంచే అమ్మాయిగారు ఇలా అయిపోయారు! లోతుగా గుంట తీసి ఏ కోలుగుల్లో అన్నా పాతి పెట్టాలను కొంటున్నాను." "ఆ పని చెయ్యొద్దు అది నా కివ్వు!" "అది మాయదారి గిన్నె బాబు! అల్లా వుద్దీన్ దీపం లాంటి దనుకోండి! అది మీ దగ్గిరోద్దు! అమ్మాయి గారి కేమయిందో చూశారుగా? చూస్తూ చూస్తూ ఆ మంత్రాల గిన్నె మీ దగ్గిర పెట్టుకుంటారా? అది ఉండవలసిన చోటు శ్మశానమే ! బాబు!" "మాధవికి కుక్కర్ దొరికిన సంగతి చెప్పోద్దనీ జడ్జి గారు చెప్పారా?" "కాదు బాబు! డాక్టర్ మూర్తి గారే చెప్పారు." "డాక్టర్ మూర్తి గారా?" "అవును బాబూ, గిన్నె దొరగ్గానే అయ్యగారి దగ్గరకు తీసుకెళ్ళాను. అప్పుడు డాక్టర్ మూర్తి గారు అయ్యగారు దగ్గరే ఉన్నారు!" "మాధవి లేదా?" "అమ్మాయిగారు ఇంట్లో లేరు. ఆ తమతో ఆరోజు బయట కెళ్ళినట్టు గుర్తు బాబూ" 'సరిగా కుక్కర్ దొరికిన సమయానికే డాక్టర్ గారు ఇంట్లో ఎలా వున్నారయ్యా?" "ఆరోజు ఉదయమే వచ్చారు. ఆరోజు శలవను కుంటాను బాబు! డాక్టర్ గారు ఉదయం నుంచి అయ్యగారితోనే ఉన్నారు." "కుక్కర్ చూడగానే డాక్టర్ గారేమన్నారు?" "అందరికీ ఆశ్చర్యం వేసింది బాబూ." "అది సరే డాక్టర్ మూర్తే మన్నారు." "సరిగా ఏమన్నది గుర్తు లేదు గానీ, డాక్టరు అనుకున్నదంతా జరిగిందన్నారు. మాధవమ్మ గారే అ రాత్రి కుక్కర్ గిన్నె దాచేశారాన్నట్టు చెప్పారు. తర్వాత అయ్యగార్లిద్దరూ ఇంకేదో ఇంగ్లీషులో మాట్టాడుకున్నారు బాబు!" "సరే నువ్వా కుక్కర్ ఎక్కడా పారేయ్యోద్దు భద్రంగా ఉంచు!" "అలాగే బాబు." "ఇంత అర్జంటుగా మాధవిని విశాఖపట్నం ఎందుకు తీసుకు వెళ్ళాల్సి వచ్చిందో తెలుసా నీకు? మాధవి ఎలా వున్నది.' సాగర్ గొంతు పూడిపోయింది. "అదేమిటి బాబు! ఇప్పటికే ఆలస్యమయిపోయిందని డాక్టర్ గారన్నారు. అమ్మాయిగారు నాలుగు మూడు రోజులుగా బాగా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు. పిచ్చి పిచ్చి పనులన్నీ చేస్తున్నారు. క్రితం రాత్రి అసలు మాధవమ్మ గారు చచ్చి పోయి ఉండాల్సింది?" "ఏం జరిగింది?" "అమ్మాయిగారు గదిలో పాత బట్టలన్నీ కుప్ప వేసి నిప్పు ముట్టించారు. మంటలు పొగలు చిమ్ముతుంటే పెద్ద అమ్మగారు చూసి కేకలు వేస్తె నేను వెళ్ళి అర్పి వేశాను. పిచ్చి పిచ్చి పాటలు పాడటం, వాళ్ళ నాన్నగారిని అమ్మగారిని ఆటలు పట్టించడం. వంటి ఇంట్లో ఉన్న పళ్ళేలన్నీ బయట గిరాటు వేయటం ఒకటేమిటి బాబు అన్నీ పిచ్చి చేష్టలే మూడు రోజులుగా కళ్ళల్లో వత్తులు వేసుకొని అమ్మాయిగారికి కాపలా కాస్తున్నామంటే నమ్మండి. ఆ డాక్టర్ బాబుగారు కాబట్టి సరిపోయింది. ఈ రాత్రి మాధవమ్మ ఏం చేసేదో తెలియదు." "డాక్టర్ గారేప్పుడు వచ్చారు?" "పొద్దున్నే! నిద్ర లేస్తూనే అయ్యగారు డాక్టర్ గారికి ఫోన్ చేసి పిలిపించారు. రాత్రి అమ్మాయి గారు బట్టలు అంటించి నప్పుడు కూడా ఫోన్ చేస్తే వచ్చారు. డాక్టర్ గారూ, అయ్యగారు మాట్లాడుకొని , విశాఖపట్నం కూడా ఫోన్  చేసి మాట్లాడారు. అక్కడ ఆస్పత్రి డాక్టర్ వెంటనే తీసుకు రమ్మని చెప్పారట. సాయంకాలం నాలుగు గంటలకు డాక్టర్ బాబుగారు, అమ్మాయిగారిని తీసుకొని కార్లో బయలు దేరారు." 'డాక్టర్ మూర్తి కూడా వెళ్ళాడా?" "వెళ్ళారా? ఏంటి బాబూ! అసలు వారే కదా. ఆరు లేకపోతే అమ్మాయిగారి పని ఇంకెంత అన్యాయం అయిపోయేదో?" సాగర్ టైం చూసుకొన్నాడు. విశాఖపట్నం వాళ్ళింకా చేరి ఉండరు. కాని వాళ్ళు చేరేసరికి తను వెళ్ళడం అసంభవం! తను కార్లో ఎంత వేగంగా వెళ్ళినా వాళ్ళను అందుకోలేడు. మాధవిని హాస్పిటల్లో చేర్పించకుండా తను అపలేడు. కొన్ని గంటల ఆలస్యంగా తను నిర్ణయం చేసుకొన్నాడు. అదే ఓకే రోజు ముందయితే మాధవి తనతో వచ్చేసి వుండేది? మాధవి తనతో వచ్చినా తను ఏం చేయగలడు? ఆ పిచ్చిదానితో పెళ్ళా? ఆ పిచ్చి దానితో తను జీవిత కాలం గడప గలడా? మాధవి

ఉచితంగా చదవగలిగిన భాగం పూర్తయినది. పూర్తి కథను చదవడానికి ప్యాకేజీ తీసుకోండి

కథను కొనుగోలు చేయండి

 
You must be logged in to view the content.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *