ఇదీ కధ 17

By | November 29, 2019
telugu stories kathalu novels books ఇదీ కధ 17 సాగర్ ఏది ఏమైనా మనకు మంచే జరిగింది. మనకు కావాల్సింది అదే కదా? మాధవిని కూడా బాబాగారి దగ్గిరకు తీసుకెళ్ళు ఆ అమ్మాయి జబ్బు కూడా నయమవుతుంది." డాక్టర్ మూర్తి సాగర్ కళ్ళల్లోకి చూస్తూ అన్నాడు. "మాధవికి ఏ జబ్బూ లేదు. మీ సలహాలు , బాబా గారి ఆశీర్వచనాలు అవసరం లేదు!" సాగర్ చివాలున లేచాడు. సాంబశివరావు కొడుకు వైపు తీక్షణంగా చూశాడు. "డాక్టర్ గారూ గుడ్ నైట్" సాగర్ డాక్టర్ అనందరావుకు చెప్పి క్లబ్ లో నుంచి బయటి కొచ్చాడు. "వాడి ధోరణి మీకు తెలిసిందేగా?' మీరేం బాధపడోద్దు.' సాంబశివరావు డాక్టర్ మూర్తితో అన్నాడు. "మాధవి పేరెత్తగానే సాగర్ అప్ సెట్ అయి పోతాడు." అంటూ మూర్తి ఆనందరావు కేసి తిరిగాడు. "మన సాంబశివరావు గారికి సాగర్ ఓ సమస్యగా తయారయ్యాడు. ఆ పిచ్చి పిల్లను ప్రేమిస్తున్నా నంటాడు. ఆ పిల్లకు పిచ్చి కుదరదు. ఇతడికి పెళ్ళవదు. ఆ మాధవి పేరెత్తితే ఇదీ వరుస! చూశారుగా డాక్టర్ గారూ!' మూర్తి మరోసారి సిప్ చేసి గ్లాసు కింద పెట్టాడు. "కొంతకాలం మీరెవరూ సాగర్ పెళ్ళి విషయం ఎత్తకుండా ఉంటే మంచిది. అతడి సమస్యను అతడ్నే సాల్వు చేసుకో నివ్వండి. ' అనందరావన్నాడు. మూర్తి ఆశ్చర్యంగా ఆనందరావు కేసి చూశాడు. "సాగర్ మాధవిని గురించి మీతో చెప్పాడా?" మూర్తి అడిగాడు. 'చెప్పాడు, చాలా చెప్పాడు అందుకే ఈ సలహా ఇవ్వడానికి సాహసించాను. మరో విషయం డాక్టర్ మూర్తి గారూ, ముఖ్యంగా మీతో చెప్పాల్సింది .మీరు మాధవి సాగర్ వ్యక్తిగత జీవితాల్లో కల్పించుకోవడం మంచిది కాదు. లివ్ దెం ఎలోన్." డాక్టర్ ఆనందరావు గ్లాసు ఖాళీ చేసి బల్లమీద పెట్టాడు. డాక్టర్ మూర్తికి అంతకు ముందు తగినదంతా దిగిపోయినట్టయింది! బాటిల్లో నుంచి గ్లాసు సగం విస్కీ వంచుకున్నాడు. 'డాక్టర్ గారూ! సాగర్ మీకు అలాంటి అభిప్రాయం కలుగజేశాడు గనుక మీరలా మాట్లాడుతున్నారు. ఇక్కడే ఉన్నారు సాంబశివరావు గారు వార్నడగండి. నేనేమి చేసినా స్నేహధర్మాన్నే పాటించే చేశాను ఇంతవరకూ. ఇదుగో - మీ ముందు ప్రమాణం చేసి చెపుతున్నా! ఈ క్షణం నుంచి వాళ్ళ కుటుంబంతో ఏ రకమైన సంబంధమూ పెట్టుకోనూ!" మూర్తి ఉద్రేకంతో ఊగిపోతున్నాడు. "మూర్తిగారూ!' సాంబశివరావు ఆదుర్దాగా డాక్టర్ మూర్తి చేయి పట్టుకున్నాడు. "స్నేహితుడుగా మా కుటుంబ డాక్టర్ గ ఈరోజు నన్ను మర్చిపోండి. నిందలు మోయవలసిన అవసరం నాకు లేదు. మాధవికి పిచ్చి కుదిరినా, కుదరక పోయినా సాగర్ కిచ్చి చేయడం మంచిది. పెళ్ళయితే పిచ్చి కుదరోచ్చేమో!" "అడ్దోస్తున్నాను క్షమించండి. పిచ్చి పిచ్చి అంటున్నారు. ఇంతకీ ఆ పిల్లకు పిచ్చని నిర్ధారణ చేశారా?" డాక్టర్ ఆనందరావు సోడా గ్లాసులో పోసుకుంటూ అన్నాడు. మూర్తికి వళ్ళు కంపరమేత్తిపోయింది. వీడు ముసలి నక్కలా ఉన్నాడు. నా విస్కీ తాగుతూ నామీదే దాడి చేస్తున్నాడు. సాగర్ చెప్పింది ఈ ముసలాడి తలకెక్కింది అనుకున్నాడు మూర్తి. ఆనందరావు మీద కసి పెరిగిపోతున్నది. గ్లాస్ ఖాళీ చేశాడు కళ్ళు ఎర్రుపెక్కాయి. పరిస్థితి చెయ్యి దాటి పోయేట్టున్నది సాంబశివరావుకు ఏం చేయడానికి తోచడం లేదు. డాక్టర్ మూర్తి వాలకం చూస్తుంటే యీ రోజు అనందరావును వదలేట్టు లేడు. ఈ డాక్టర్లిద్దరి తగాదాను తను గాని సాగర్ గాని కారణం కావటానికి ఇష్టం లేదు. ఇది ఆఫీసర్స్ క్లబ్ ఏం జరిగినా తెల్లవారే సరికి ఊరంతా పొగ మంచులా వ్యాపించి పోతుంది. "డాక్టర్ మూర్తి, ప్లీజ్ టేకిట్ యీజే అంటూ సాంబశివరావుమూర్తి భుజం మీద చెయ్యి వేశాడు. డాక్టర్ ఆనందరావు వైపు తిరిగి 'డాక్టర్ గారూ! సాగర్ మీతో చెప్పిందంతా నిజమని నమ్మినట్టున్నారు, వాడికి ఈ మధ్య మతి సరిగా లేదు. ఏవేవో భ్రమలకు గురవుతున్నాడు. ఎన్నో కధలు చెప్తున్నాడు. తను ప్రేమిస్తున్న మాధవికి మతి చలించడం చూసి వీడు భరించలేక పోయాడు. ఆ ఎఫెక్ట్ వీడి మీద కూడా పడింది. వాడ్ని ఆ ప్రమాదం నుంచి కాపాడమని నేనే డాక్టర్ మూర్తిని ప్రాధేయపడ్డాను. స్నేహ ధర్మాన్ని పురస్కరించుకొని మూర్తి మా కుటుంబానికి సహాయం చేయడానికి ముందుకు వచ్చాడు. మావాడి మానసిక స్థితి సంగతి తెలిసి కూడా తన కూతురు సుజాతను ఇవ్వదానికీ సిద్దమయ్యాడు. ఒక్కగానొక్క కూతురు అతడు కావాలంటే చుక్కల్లో చంద్రుడ్నయినా దించగలడు మూర్తి. అలాంటి త్యాగమూర్తి మీద నిందలు మోపడం న్యాయం కాదు. డాక్టర్ ఆనందరావు గారూ! మీరంటే నాకెంతో గౌరవం. మీకు కూడా ఏంటో ఋణపడి వున్నాను. మీ ట్రీట్ మెంట్ తో నా భార్యకు పునర్జన్మను ప్రసాదించారు. మీ ఇద్దరూ మా కారణంగా ఘర్షణ పడటం ఏమీ బాగాలేదు. " చాలా ముక్తసరిగా మాట్లాడే సాంబశివరావు ఉపన్యాస ధోరణిలో మాట్లాడేస్తున్నాడు. లోపలున్న మూడు పెగ్గుల విస్కీ సాంబశివరావు చేత మాట్లాడించేస్తున్నది. డాక్టర్ మూర్తి కోపం సోడా పొంగులా జారిపోయింది. డాక్టర్ అనందరావుకు అంతకుముందు మాట్లాడిందేమిటో గుర్తు లేదు. "సాంబశివరావ్! మీరనేదేమిటి? ఇంతకీ ఎవరు ఎవరితో పోట్లడతున్నారంటావ్?" నాలుగో పెగ్గు మింగేసి , వస్తున్నా వెక్కిళ్ళను ఆపుకోవడానికి ప్రయత్నించాడు. సాంబశివరావు ఇద్దరి డాక్టర్లను చూశాడు. వాళ్ళిద్దరూ లెవెల్ దాటినట్టుగా ఉన్నారు. "యస్. యస్. యూ ఆర్ రైట్ డాక్టర్! నో బడి యిజ్ పైటింగ్ విత్ ఎనీ బడీ! వుయ్ ఆర్ అల్ ఫ్రెండ్స్ లెటజ్ డ్రింక్స్ టు అవర్ ఫ్రెండ్ షిప్" అంటూ డాక్టర్ మూర్తి బాటిల్ లో మిగిలి వున్న విస్కీ మూడు గ్లాసుల్లోకి వంపేశాడు. డాక్టర్ ఆనందరావు సోడా పోశాడు. "టు ది హేల్తాఫ్ డాక్టర్స్" సాంబశివరావు గ్లాసు ఎత్తాడు. "టు ది హేల్తాఫ్ పోలీస్ ఆఫీసర్" డాక్టర్లు ఇద్దరు గ్లాసులు ఎత్తారు.   19 'అమ్మా ఎలా ఉంది?" "నాకేంరా బాబూ! బాగానే ఉన్నాను. బాబాగారి దయ వల్ల! నా దిగులంతా నీ గురించే రా బాబు!" "నా గురించా? ఏమిటమ్మా అదీ?" సాగర్ తల్లి ప్రక్కకు కూర్చుంటూ అన్నాడు. "నా బొందిలో ప్రాణం ఉండగానే నీ పెళ్ళి చూడాలనుకొన్నాను. డాక్టర్ మూర్త్జి గారికి మనమెంతో రుణపడి ఉన్నాము ఆ పిల్ల సుజాతకు నువ్వంటే పంచ ప్రాణాలు ఈ నెల దాటితే మళ్ళీ ముహూర్తాలు లెవ్. మీనాన్న గారిని  రేపే మూర్తి గారితో మాట్లాడమంటాను......" సుభద్రమ్మ చెప్పుకు పోతున్నది. 'డాక్టర్ మూర్తి వట్టి మోసగాడు. నీకు లేని జబ్బు అంటగట్టాడు. మాధవిని పిచ్చిదాన్ని చేయాలని ప్రయత్నం చేస్తున్నాడు. మీ మీద వత్తిడి తీసుకొచ్చి సుజాతను అంట గట్టాలని ప్రయత్నం చేస్తున్నాడు....." "ఒరే సాగర్! ఏం మాట్లాడుతున్నావురా?" సుభద్రమ్మ అరిచినంత పని చేసింది. "వాస్తవం మాట్లాడుతున్నాను! ఈ పోలీసోడెమో ఆ మూర్తి గాడి వలలో చిక్కుకున్నాడు. కీలుబొమ్మలా అతడు చెప్పినట్టల్లా ఆడుతున్నాడు!" "ఒరేయ్! మూర్తి దేవుడు లాంటి వాడు రా! స్వయంగా బాబగార్ని తీసుకొచ్చి నా జబ్బు నయం చేయించాడు రా!" "బాబానా? వాడంత కంటే మోసగాడు!" "సాగర్! కళ్ళు పోతాయ్!" సుభద్రమ్మ అరిచినంత పని చేసింది. "మీ భార్య భర్త లిద్దరికీ ఎప్పుడో పోయినాయి . కళ్ళుండే గుడ్డి వాళ్ళయ్యారు. ఆ మూర్తి ఉచ్చులలో పడి వాస్తవాన్ని చూడలేకపోతున్నారు." "నువ్వా పిచ్చిదాని మైకంలో పడి ------"

ఉచితంగా చదవగలిగిన భాగం పూర్తయినది. పూర్తి కథను చదవడానికి ప్యాకేజీ తీసుకోండి

కథను కొనుగోలు చేయండి

 
You must be logged in to view the content.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *