ఇదీ కధ 16
telugu stories kathalu novels books ఇదీ కధ 16
"నన్ను క్షమించు!"
"డాక్టర్!' సాంబశివరావు ఉలిక్కిపడ్డాడు. తనను గురించే ఆలోచిస్తున్నానని డాక్టరు భావిస్తున్నట్లున్నాడు.
"మూర్తి గారు నన్ను అపార్ధం చేసుకోవద్దు. నేను చేసిన పనికి కుమిలిపోతున్నాను. కారు టైరులో గాలి తీసి వేయడానికి నేనే కారణం. సాగరును బయటికి వెళ్ళకుండా చేయడానికి అలా చేయించాను. వాడు యీ పనిమీద బయటికి వెళ్తాడని నేను ఊహించలేక పోయాను. దాన్ని గురించే బాధపడుతున్నాను." అన్నాడు సాంబశివరావు.
"ఏమైనా సుభద్రమ్మ గారి ఆరోగ్య విషయంలో సరైన నిర్ణయం జరగకపోయి ఉంటె బాధ్యత నాదే! సెకండ్ ఒపినియన్ తీసుకోకపోవాదం ముమ్మాటికి నాదే పోరాపాటు"
"ఈసారి చేయించే బయాప్సీ భిన్నంగా ఉంటుందనే నమ్మకం ఏమిటి?"
"ఆ నమ్మకం డాక్టర్ ఆనందరావు గారి కున్నది. అయన గారి నమ్మకం వమ్ము కాకుండా ఉండాలనే నేను కోరుకుంటున్నాను. అలా జరాగాలని భగవంతుడ్ని ప్రార్ధిస్తాను" డాక్టర్ మూర్తి అన్నాడు.
"డాక్టర్! మీకు కూడా దేవుడి మీద నమ్మకం వున్నదా?"
"డాక్టర్ అయినంత మాత్రాన సృష్టి స్థితి లయకారణమైన మహత్తర శక్తిని కాదనలేము కదా? ,మేము నిమిత్తమాత్రులం - అన్నట్లు మర్చిపోయాను చెప్పడం! వచ్చే శనివారం బాబాగారు మన ఊరు వస్తున్నారు. ఈసారి మా ఇంట్లోనే వారు బస చేస్తారు. మీరు కూడా వీలు చూసుకొని బాబాగారి దర్శనం చేసుకోండి!"
"నేనా?"
"ఏం భగవంతుడు మీద నమ్మకం లేదా?"
"భగవంతుడు మీద నమ్మకం ఉంది , కాని యీ బాబాల మీద లేదు!"
"శాయి బాబా గారు సాక్షాత్తు భగవాన్ అవతారం కొమ్ములు తిరిగిన నాస్తికులే అయన ముందు బిత్తరపోయారు. అంతర్జాతీయ అవార్డు అద్నుకొన్న శాస్త్రవేత్తలు ఎంతోమంది బాబాగారి శిష్యులుగా ఉన్నారు. అణు పరిశిధనా ప్రవీణులే బాబాగారి భక్తులయ్యారు! అంతదాకా ఎందుకూ? మీ ఐ.జి.పీ బాబాగారి శిష్య పరమాణువు. ఎంతోమంది పోలీసు ఆఫీసర్లు బాబాగారి దర్శనం కోసం పడిగాపులు గాస్తుంటారు."
"బహుశా ! ఐ.జి. పి. ని ప్లీజ్ చేయడానికి కావొచ్చు మా దిపార్టు మెంటు సంగతి మీకు పూర్తిగా తెలియదు. బాస్ గారి కుక్కకు, చేతి కర్రను కూడా పూజిస్తారు. పోనీ అలా అయినా నటిస్తారు."
"ఆ మాట నిజమే అనుకో! కాని మన బాబాగారు అందరి బాబాల లాంటి వాడు కాదు. సాక్షాత్తు భగవత్ అంశ ఉన్నవారు. సుభద్రమ్మ గారి ఆరోగ్యం విషయం బాబాగారికి విన్నవిస్తాను. వారు ప్రసన్నులయితే సుభద్రమ్మ గారిని స్వయంగా వచ్చి ఆశీర్వదించుతారు."
"వారి ఆశీర్వచనం బలం మీద పాధలాజికల్ ఎగ్జామినేషన్ రిజల్ట్ మారుతుందంటారా డాక్టర్!" సాంబశివరావు పెదవి విరిచాడు.
"ఏమైనా జరగవచ్చు! బాబాగారి అనుగ్రహం వుంటే - అలా ఎన్నో జరిగాయి. మెడికల్ సైన్సుకు అందని ఎన్నో రోగాలు బాబాగారి స్పర్శతో నయమైనాయి. మీకు నమ్మకమున్నా లేకపోయినా నా ప్రయత్నం నన్ను చేయనీయండి!" డాక్టర్ బ్రతిమాలుతున్నట్టు అన్నాడు.
"అలాగే కానీయండి, బాబాల మీద నమ్మకం ఉన్నా లేకపోయినా మీ ప్రయత్నానికి అడ్డురాను. సుభద్ర ఆరోగ్యం బాగుపడటమే నాకు కావాల్సింది." అన్నాడు సాంబశివరావు,