ఇదీ కధ 10
ఇదీ కధ 10 పాపా? నీ పేరు ?" ప్రొఫెసర్ కంఠం గంభీరంగా వున్నది.
"సునీత"
"కాదు! మాధవి"
"కాదు! సునీత"
"సునీత అని ఎవరు పిలిచేవాళ్ళు?"
"మా అమ్మా, నాన్న - ఇంకా అందరూ."
"అందరూ అంటే ఇంకా ఎవరు పిలిచే వాళ్ళో చెప్పు!"
"మా వంటవాడు!"
"వాడి పేరు?"
"వాడి పేరు - పేరు"
"బాగా గుర్తు చేసుకో?"
"అవును! రాముడు, వంట రాముడు."
"రాముడంటే నీ కిష్టమేనా?"
"లేదు."
"ఎందుకని?"
"వాడు చెడ్డవాడు?"
"ఎలా వుంటాడు?"
"లావుగా , ఎత్తుగా, నల్లగా , మొద్దులా వుండేవాడు. "
సాగర్ ప్రొఫెసర్ పక్కగా వచ్చి ప్రొఫెసర్ చెవిలో మెల్లగా అన్నాడు.
"డాక్టర్ మూర్తిలా ఉంటాడేమో అడగండి సార్."
"ప్లీజ్ సాగర్! మాట్లాడవద్దు." చంద్ర శేఖర్ సాగర్ కేసి చురుగ్గా చూశాడు. ఆమె ఇప్పుడు బాల్యదశ ట్రాన్స్ లో వున్నది. ఆ ప్రశ్నకు సమాధానం రాకపోవచ్చు."
సాగర్ నిస్పృహతో ప్రొఫెసర్ కేసి చూశాడు. అది గమనించి ప్రొఫెసర్