మీరా వారి కోసం దోశలు వేస్తుంది
ఆమె నన్ను చూడగానే ఏమండీ మీ కోసం కొన్ని దోశలు
చేస్తున్నా అని చెప్పింది
“నాకు వద్దు .. తరువాత తింటాను.
అవును మీరా నువ్వు ఇప్పుడు ఎక్కువగా నీ జుట్టులో గులాబీ పూలు పెట్టుకుంటున్నట్టు అనిపిస్తోంది? నాకు
మీరా దోశలు తయారు చేస్తూ కొద్ది సేపు ఆగి పోయి మౌనంగా ఉంది ఆమె చలనంలేకుండా స్తంభించిపోయింది నేను అలా గమనించాను
కొన్ని క్షణాలు తరువాత ఏం చేమంటారు పూలమ్మే ఆవిడ
రోజు గులాబీ పూలే తెస్తుంది ఈరోజు కూడా అవే తెచ్చింది
ఎవరో నన్ను కొరడాతో కొట్టినట్లు అనిపించింది
మీరా నాతో అబద్దం చెప్పడం ప్రారంభించింది
ఆమె చాలా తప్పు చేస్తోంది
ఆమె కంట్లో నీరు అటూ తిరిగి తుడుచుకుంటోంది
మీరా ముఖం భయంతో ఉన్నట్లు అనిపించింది
ఆమె వేసిన రెండు దోశలు అతి కష్టమ్మీద తిన్నాను
ఉదయం కూడా మీరా ముఖం మామూలుగా లేదు
ఆమె కాస్తా ఆందోళనగా ఉన్నట్లు అనిపించింది
మీరా నన్ను చూడడం తగ్గించింది
నేను మౌనంగా ఉంటున్నాను
ఆతరువాత ప్రభు నన్ను కలవడానికి రాలేదు
ఇంటికి రావడం లేదు
మీరా అతనితో ఏదో చెప్పి ఉండాలి
ఒకవారం రోజులు గడిచాక ఎలాంటి అనుమానాలు అపార్ధాలు తలెత్తకుండా ఉండటానికి నేను మీరా తో జాగ్రత్తగా ప్రవర్తించాను
అయితే మీరా మాత్రం తిరిగి సాధారణ స్థితికి ఇంకా