ఇసుక పూలు 2
telugu stories kathalu novels ఇసుక పూలు 2 నేను సిటీలో ఉంటూ జాబ్ సెర్చింగ్ మొదలుపెట్టాను.
రెండు ఇంటర్వ్యూలకి అటెండయితే అనుభవం లేదని రిజెక్ట్ చేశారు. నా మార్కులవల్ల మూడో దాన్లో సెలక్టయ్యాను.
పదిహేను వేల జీతం, ఎసి ఆఫీసు, ల్యాప్‌టాప్, బైక్‌కి జీరో పర్సెంట్ ఇంట్రస్ట్‌తో లోన్,.. చాలా ఇచ్చింది కంపెనీ.
వెంటనే ఊరొచ్చి అమ్మానాన్నలకి చెప్పాను. వాళ్ళు సంతోషంతో కళ్ళనీళ్ళు పెట్టుకున్నారు.
జాబ్ వచ్చిందని ఎంతో ఆనందం కలుగుతున్నా.. వెలుగొస్తే వచ్చే నీడలా ఆ ఆనందం వెంటే ఏదో తెలీని బాధ. నేనొకచోట, నాన్నాళ్ళు ఇంకోచోట..!
ఉద్యోగంకోసం, పొట్ట పోషించుకోవడానికి కొడుకులు సిటీలకి వెళ్ళి ఉండక తప్పదు. ఆ కొడుకులే ఆసరా అవుతారని చూసే తల్లిదండ్రులు మాత్రం ఎక్కడున్నవారక్కడే..! ఈ అంతరాలు ఎన్నాళ్ళు..? జీవితాంతం ఇంతేనా..?
నేను ఎసి గదుల్లో ఉండి, వ్రేళ్ళు ఆడించో, నాలుగు ప్లాన్లతో స్పేర్స్ మౌల్డ్ కనుక్కుంటేనో.. చేస్తే వేలకు వేలు జీతాలు.
ఇక్కడ ఇంతమంది- ఎండలో చెమటోడ్చి, కాళ్ళూ చేతులూ నడుములూ అరిగిపోయేంతగా కష్టపడుతుంటే; అంత శ్రమకీ ప్రతిఫలం ఇంతేనా..!
ఎందుకు రెండిటికీ తేడా..? శారీరక కష్టం కంటే బ్రెయిన్ ఆలోచనలకే విలువెక్కువా..? అందుకే గళ్ళు ఉప్పు రేటుకీ, మెషినరీతో ప్రాసెస్డ్ చేసిన సాల్ట్ ప్రైజ్‌కీ అంత వ్యత్యాసమా..?
ఆలోచిస్తున్న కొద్దీ నా బ్రెయిన్లో ఏదో ఆలోచన మెరుపులా మెరిసింది. క్షణ క్షణానికీ.. ఆ మెరుపు వెలుగు పెరుగుతూనే ఉంది.
* * *
ఆరు నెలలు గడిచాయి. ఉద్యోగానుభవం ఇచ్చిన ధైర్యంతో జాబ్ రిజైన్ చేసేశాను.
నా ఆలోచనకి ఓ రూపం వచ్చింది. మౌల్డింగ్ డిజైన్