దోబూచులాట 1
telugu stories kathalu novels దోబూచులాట 1 పడగ్గది నిశ్శబ్దమయింది. మంచం నిట్టూర్చింది. నీలి బల్బు విచారాన్ని వ్యక్తం చేసింది. అగరొత్తుల పరిమళాలు అనాథలుగా మారాయి. మల్లెలు మాటరాని మౌనాన్ని ఆశ్రయించాయి. శృంగారానికి శృంగభంగమైంది. స్పర్శకు ఎడబాటు మొదలయింది. దోబూచులాట మొదలైంది.
*****
స్నానం చేస్తోంది సత్యభామ. షవర్ ధార ఆమె అనాచ్ఛాదిత అందాలను చూసి వేడెక్కింది. స్టాండ్ మీద వున్న నైటీ ఎప్పుడెప్పుడు ఆమెను వాటేసుకుందామా... అని ఎదురుచూస్తోంది. అయినా సత్యభామ అనబడే సత్యలో ఏ ఫీలింగ్సూ లేవు. పెళ్ళయిన ఏడేళ్ళకే ఎడబాటా? తమ మధ్య శృంగార జీవితానికి భంగపాటా? ఏమిటీ పాట్లు? ఆమెలో ఆలోచనలు షవర్ ధారని మించి వేగంగా కిందికి జరుగుతున్నాయి. తలను ముద్దాడిన నీటిధార పెదవులను చేరి ముద్దాడాలని ఆశపడి, కంఠాన్ని చేరి, కౌగిలించుకోవాలని కోరిక పడి, ఎదను చేరి, అతుక్కుపోవాలని వేగిరపడి ఆపై జారుతూ చిన్నపాటి ఉద్వేగానికి లోనై... ఠపీమని ఆమె పాదాల మీద చతికిలపడి నేల మీదికి జారింది సత్య ఆలోచనలా....
*****
నైటీలోకి మారి నిస్త్రాణగా బెడ్ మీద వాలింది. వెల్లకిలా పడుకుంది. బోర్లా పుడకుంది. ఓ పక్కకు తిరిగింది. అయినా ఆమె శరీరానికి స్వాంతన కలగడం లేదు. ఆమె మనసుకు తగిలిన గాయానికి ఉపశమనం లేదు. ఏడేళ్ళు... ఏడు క్షణాలే అయ్యాయి. కానీ ఇప్పుడిప్పుడే ఈ మధ్యే శ్రీచంద్రలో నిరాసక్తత... అది తన మీద ప్రేమ తగ్గడం వల్ల కాకపోవచ్చు. వృత్తిపరమైన బిజీ వల్ల కావచ్చు.. అలసట వల్ల కావచ్చు.. లేదా సెవన్ యియర్స్ ఇచ్లా.. అతనికి మరో అమ్మా యి మీద... చ ఛ ఛ... ఆ ఆలోచననే భరించలే