ధర్మేచ అర్థేచ..3
telugu stories kathalu novels ధర్మేచ అర్థేచ..3 అతను నవ్వాడు. "ఎందుకూ అంటే.." అని రెండుక్షణాలు ఏదో ఆలోచిస్తున్నట్టుగ ఆగి, చెప్పాడు. "ట్రైన్లో ఫస్ట్‌టైం మిమ్మల్ని చూసినప్పుడే ఫ్లాట్ నేను. మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తుంటే అర్థమైంది.. మీరా సీట్లో ఇబ్బంది పడుతున్నారని. మీకు హెల్ప్ చెయ్యాలనిపించింది. ఆ నైట్ మెలకువగా ఉండి, మధ్యమధ్యలో మా ఫ్రెండ్స్‌ని లేపీ, మొత్తానికి మార్నింగ్ విజయవాడ వచ్చేసరికి ముగ్గురం ఫుల్లునిద్రలో ఉన్నాం. ఎక్కడో గుడివాడలో మెలకువొచ్చింది." చెప్తూ గట్టిగ నవ్వాడతను. అక్కణ్నుంచి రిటర్న్ రావడానికి ఎంతిబ్బంది పడిందీ చెప్పుకొచ్చాడు.
'అతను మెలకువగా ఉన్నది నాకోసమేనా..!' ఇద్దరిమధ్యా కొన్నిక్షణాల మౌనం.
అతనే చెప్పాడు మళ్ళీ, "అప్పుడు మిమ్మల్ని పెళ్ళి చేసుకోవాలి అనైతే లేదు. జస్ట్ మీ బిహేవియర్, సెన్సిటివిటీ నచ్చాయి. యూనో... ఆడవాళ్ళకి అవే అందం." మళ్ళీ ఓ నిముషం ఆగాడు. "మీరు నాకు పెళ్ళి చేసుకునేంత నచ్చడానికి మీ బుక్ ఇంకో కారణం." నా వంక చూస్తూ అన్నాడు.
ఆ మాట ఓ ప్రపంచ వింతలా అనిపించింది నాకు.
అతను చిన్నగా నవ్వాడు. "నాకు ఫైనాన్షియల్ ప్లానింగ్ ఉండదు. ఉన్నా.. నైన్టీ పర్సెంట్ శాలరీ పనికిరాని వాటికే ఖర్చుపెడుతుంటాను. మీ బుక్‌లో మీ శాలరీ ఎక్స్‌పెండిచర్