బ్లాక్ రోస్ 4
naa telugu kathalu బ్లాక్ రోస్ 4 రోజు లాగే విన్ షాప్ మొత్తం నిండి పోయింది అప్పుడు ఒక కస్టమర్ వేయిటర్ తో గొడవ పడుతూ ఉంటే విన్ వెళ్లి ఏంటి సమస్య అని అడిగాడు దాంతో చూస్తే అతని షర్ట్ పైన టేబుల్ పైన పక్షి రేట పడింది దాంతో పైకి చూస్తే పైన ఉన్న పావురాళ్లు ఖాళీగా ఉన్న రూఫ్ పై నుంచి కింద షాప్ నీ పాడు చేస్తూ ఉన్నాయి, దాంతో విన్ కస్టమర్ కీ సారీ చెప్పి తనకు బిల్ ఇవ్వోదు అని చెప్పి కోపం తో పైకి వెళ్లాడు అక్కడ వర్ష బాస్కెట్ బాల్ ప్రాక్టీస్ చేస్తూ ఉంది అలా తనని చూసే సరికి విన్ ఒకసారి అలాగే శిల్పం లాగా నిలబడి వర్ష అందం చూస్తూ ఉన్నాడు అప్పుడే ప్రభాకర్ వచ్చి విన్ నీ చూసి పిలిస్తే