బ్యూటీ స్టెనో
naa telugu kathalu బ్యూటీ స్టెనో కొత్తగా ఆ బ్రాంచ్ కి మేనేజర్ గా అప్పాయింట్ అయ్యాడు విష్ణువర్థన్. అతడు ఆఫీసుకు వచ్చి న మొదటిసారి స్టాఫ్ అందరూ ఎంతో ఘనంగా స్యాగతం పలికారు. అతని దృష్టిలో పడటం కోసం ఒకరిని మించి ఒకరు పోటీ పడి అందమైన పూల బొకెలని అతనికి ప్రజెంట్ చేసారు. ఆ ఆఫీస్ స్టాఫ్ తో పరిచయ కార్యక్రమాలు పూర్తయ్యాక తన ఛాంబర్ లోకి వచ్చి ఈజీ ఛైర్ లో రిలాక్స్ డ్‍గా కూర్చున్నాడు విష్ణువర్థన్.
అతనికి ముప్పై సంవత్సరాల వయసుంటుంది. ఇంకా పెళ్ళి కాలేదు. దేహధారుడ్యం, కండపుష్టి కలవాడు.. డ్రెస్సెన్స్, బాడీ సెన్స్ ఉన్నవాడు.. చాలా అందంగా చూడగానే అందరీని ఆకట్టుకునే పర్సనాలిటీ అతనిది… కానీ అతనిలో కొంచెం కూడా గర్వం కనిపించదు. చేసే వర్కుని సిన్సియర్ గా చేయడం వల్ల ఇంత చిన్న వయసులోనే మేనేజర్ స్థాయికి ఎదిగాడు. టేబుల్ పైన ఉన్న ఫైల్స్ లో నుండి ఒక దానిని తీసి ఓపెన్ చేసాడు.. దాన్ని స్టడీ చేస్తూ ఇంటర్ కమ్ ప్రెస్ చేశాడు. మరుక్షణంలో అక్కౌంటెంట్ సూర్యం ఛాంబర్ కి వచ్చాడు.
”కూర్చోండి…” తన ఎదురుగా ఉన్న కుర్చీని చూపిస్తూ అన్నాడు విష్ణువర్థన్.
సూర్యం కూర్చున్న తర్వాత..” మన కంపెనీకి సంబంధించిన బిజినెస్ ఎక్కౌంట్స్ డిటెయిల్స్ నాక్కావాలి… సాయంత్రం వరకూ ఇవ్వగలుగుతారా?” అడిగాడు విష్ణువర్థన్.
"ఓ.. ష్యూర్.. తప్పకుండా