భార్య భర్తలు కలవడం
telugu stories kathalu novels భార్య భర్తలు కలవడం బావా, ఉదయం తొందరగా లేవాలి. గుర్తుందా!’ మంచం మీద అతని పక్కనే పడుకుంటూ అంది లావణ్య.‘అబ్బా, ఇప్పటికిది పదోసారి చెప్పావు లావణ్యా! నీకు చిన్న వయసులోనే ఇంత చాదస్తం అయితే రేప్పొద్దున అమ్మవి అమ్మమ్మవి అయితే ఇంకెంత చాదస్తం వస్తుందో’’ భార్యను ఆటపట్టిస్తూ అన్నాడు కారుణ్య.‘అంటే ఏంటంటావు. ఒకటికి రెండుసార్లు చెబితే అది చాదస్తం అవుతుందా?’ తలలోని మల్లె పూలు తీసి పక్కన టేబుల్ మీద పెడుతూ అంది లావణ్య.‘మరి దాన్ని ఇంకేమంటారు? అవునూ! పూలెందుకు తీసేశావు’ అడిగాడు కారుణ్య.‘ఎందుకేమిటి, ఇప్పుడు తలలో ఉంటే నలిగి పోతాయి. అందుకే తీసేశాను. మరలా రేపు ఉదయం పెట్టుకుంటాను’ చెప్పింది లావణ్య.‘బావుంది లావణ్యా, మనకు కొత్తగా పెళ్ళైంది. తల్లో పూలు ఉంచుకుంటే బాగుంటుంది కదా! కావలిస్తే నేను నీకు ఇంకా తెస్తాను. అప్పుడు రాత్రికి కొన్ని, మర్నాటికి కొన్ని ఉంచుకో!’’ నవ్వుతూ అన్నాడు కారుణ్య.‘అంటే ఏంటి? జడలో నీకు పూలు ఉంటేనే కాని మూడ్ రాదా?’’ కొంటెగా అంది లావణ్య.‘‘అలా అని కాదు.