అతగాడు…అతడు! 3
telugu stories kathalu novels అతగాడు…అతడు! 3 ”ఇప్పుడు ఎంత అరిచినా ప్రయోజనం లేదు. ఒక్క రోజు ముందు నువ్వొచ్చి వుంటే అందరినీ వదిలేసి నీతో పాటు నేనెక్కడికైనా హాయిగా వచ్చేదాన్ని. కానీ ఇప్పుడు నేను అలా చేయలేను. వారం రోజులలో పెళ్ళి పెట్టుకుని ఎవడితోనో లేచిపోయిందని అందరూ అనుకుంటూ వుంటే ఆ మాటలు భరించలేక మా వాళ్ళు కుమిలిపోయేలా నేను చేయలేను. మా ఇంటి పరువు, మర్యాదలని మంట గలిసేలా ప్రవర్తించలేను” బాధగా అంది మానస.
”నువ్వు ఊహించుకున్నట్లుగా ఏమీ జరగదు మానసా. రేపు ప్రొద్దున్నే మీ అన్నయ్యతో మన పెళ్ళి గురించి మాట్లాడతాను. మనిద్దరిని ఒకటి చేయమని కాళ్ళా వేళ్ళా పడైనా సరే ఒప్పుకునేటట్లు చేస్తాను” సముదాయిస్తున్నట్లుగా అన్నాడు అతడు.
”నువ్వు అనుకున్నంత సులభంగా జరిగే పని కాదు ఇది. నిన్ను చూస్తేనే మా అన్నయ్య అగ్గి మీద గుగ్గిలంలా మండిపడతాడు. అలాంటిది మన పెళ్ళికి అతను ఒప్పుకోవడం కల్ల” ఆవేదనగా అంది మానస.
అతడు ఏమీ మాట్లాడలేదు. ఎంతో అప్ సెట్ అయిన వాడిలా మౌనంగా వుండిపోయాడు. రెండు నిమిషాలు వాళ్ళిద్దరి మధ్య నిశ్శబ్దం రాజ్యమేలింది! మానస అతడి దగ్గరకొచ్చింది. అతడి కళ్ళలోకి సూటిగా చూస్తూ ”మన ప్రేమకి గుర్తుగా నేనొక కోరికని కోరతాను తీరుస్తావా…?” అంది.
”ఏంటి…?” అన్నాడతను.
”మన మనసులు కలిసినా మనిద్దరం కలిసి జీవించే అదృష్టం మాత్రం దక్కలేదు. అయినా నీ గురించి జ్ఞాపకాలని, తీపి గుర్తులని నా జీవితాంతం గుర్తుంచుకునేలా ఒక్కసారి మనిద్దరం శారీరకంగా ఒకటవుదాం” మానస తలదించుకుంది. ఆమె మాటలు అర్థం కాగానే షాకైపోయాడు అతడు. ఆశ్చర్యంగా కళ్ళు పెద్దవి చేసి ఆమె వైపే చూడసాగాడు. ఆమె కామోద్రేకంతో కోరిన కోరిక కాదది. కేవలం తనపై వున్న ప్రేమని తన హృదయంలో శాశ్వతంగా పదిల పరుచుకోవడానికి కోరిన కోరిక. ఒక్కసారిగా అతడి హృదయం ఆమె పైన అభిమానంతో