అతగాడు…అతడు! 1
telugu stories kathalu novels అతగాడు…అతడు! 1 అతడు వస్తాడు… తప్పకుండా వస్తాడు…! అసంపూర్తిగా మిగిలిపోయిన నా అందమైన స్వప్నాన్ని తన రాకతో సంపూర్ణంగా నాకందిస్తాడు.
సరిగ్గా రెండు సంవత్సరాలవుతోంది. అతడు నాకు దూరమై… అయినా అతని ఆలోచనలు నన్నెప్పుడూ వీడిపోలేదు. ప్రతిరోజూ అతని జ్ఞాపకాలనే నెమరువేసుకుంటూ ఈ రెండు సంవత్సరాలని ఎలాగో నెట్టుకుంటూ వచ్చాను. ఇక నావల్ల కాదు! అతడిని తక్షణమే చూడాలి… అతని కౌగిలిలో గువ్వలా ఒదిగిపోవాలి… ఒదార్పునిచ్చే అతని హస్తాల్ని లాలనగా స్పృశించాలి. ప్రేమని చిందించే అతని కళ్ళలోని భావాలని మనసులో నిక్షిప్తం చేసుకోవాలి.
అతని గుండెలపైన తల ఆన్చి హాయిగా సేద తీరాలి!! ఈ రెండేళ్ళూ తను అతని కోసం పడిన వేదనని వివరించాలి. నన్ను వంటరిదాన్ని చేసి దూరంగా వెళ్ళిపోయినందుకు అతడితో పోట్లాడాలి. అతడి కోసం ఎదురు చూస్తూ మనసు పడిన వేదనని కన్నీళ్ళ రూపంలో అతడి ఎదుట ధారపోయాలి. ఇవన్నీ చేయాలంటే అతడు రావాలి! ఆమె కళ్ళు తడిగా వున్నాయి. ఎవరి కోసమో ఎదురు చూస్తున్నట్లు ఆరాటంగా వున్నాయి. ఆమె కోరుకున్న రూపం ఒక్కసారిగా ఎదురుగా నిలిస్తే.
ఆమె ఆనందానికి అవధులు ఉండవు. కానీ…. ఆ సమయం రావాలంటే… ఇంకా ఒక్కరోజు ఆగాలి…! రోజులు గంటలుగా… గంటలు నిముషాలుగా… నిముషాలు క్షణాలుగా మారితే ఆ క్షణం వస్తుంది. కానీ క్షణమే ఒక యుగంలా గడిచిపోతూంది. చల్లటి గాలికి ఆమె ముంగురులు ఆమె కళ్ళకి అడ్డు తగిలాయి. అయినా ఆమె చూపు స్థిరంగానే వుంది.
”మానసా! మేడపైన ఏం చేస్తున్నావే. నీకోసం అందరూ ఎదురు చూస్తున్నారు. త్వరగా క్రిందకు రా!” ఆమెను సమీపించింది స్నేహితురాలు స్వరూప.
మానస భుజాన్ని పట్టి తన వైపుకు లాక్కుంది. ”ఏమిటే! కళ్ళు అలా