అర్దరాత్రి ఆడపడుచులు 9
telugu stories kathalu novels books అర్దరాత్రి ఆడపడుచులు 9 ఆమాట వినగానే సృజన ప్రాణాలు తిరిగి వచ్చినట్లయింది.
అహల్య బతికితే తను మర్డర్ చేసినట్లుకాదు.
సృజనను గదిలోకి లాక్కెళ్ళాడు కిష్ణయ్య. సంకెళ్ళు ఊడదీసాడు. అక్కడ ఒకకొయ్యస్తంభం ఉంది. దాన్ని కావలించుకుని నిలబడ్డట్లు నిలబడమన్నాడు సృజనని. స్థంభాన్ని చేతులతో చుట్టేసినిలబడింది సృజన.
అప్పుడు ఆమె చేతులకి మళ్ళీ బేడీలు వేసాడు కానిస్టేబుల్ కిష్ణయ్య.
ఇంక సృజన పారిపోవాలంటే ఆ స్థంభాన్ని పెకలించుకుపోవాల్సిందే!
ఆమె తప్పించుకుపోయే అవకాశం అసలు లేదని రూఢి చేసుకున్న తర్వాత అహల్యపడి ఉన్న చోటుకి వెళ్ళాడు కిష్టయ్య.
అహల్య పక్కనే కూర్చుని నాడి చూస్తోంది రంగేలీ.
"బతుకుతుందా?" అన్నాడు కిష్ణయ్య ఆదుర్దాగా అహల్య బతకాలనిఉంది అతనికి.
వాళ్ళందరి పాలిట బంగారు గుడ్లు పెట్టేబాతులాంటిది అహల్య. ఆమెబతికి ఆమె బిజినెస్ బాగా జరుగుతుంటే అతను పచ్చగా ఉంటాడు.
ఆలొకాలిటీలో ఇంకొంతమంది మేడమ్ లు ఉన్నారుగా నీ అహల్య అంతసమర్ధులు ఎవరూ లేరు. ఆమె లాగా ధారాళంగా డబ్బు సంపాదించేవాళ్ళూ, ధారాళంగా డబ్బు వెదజల్లేవాళ్ళు కూడా ఎవరూలేరు.
అహల్య పోతే కానిస్టేబుల్ కిష్ణయ్య మొదలుకుని చాలామందికి లాసే!
"కొసప్రాణంకొట్టుకుంటోంది" అంది రంగేలీ అయినా భయంలేదు. మాహుకుడు ఏమన్నాడు. పంటితో నమిలిన వెంపలి వేరు రసం శాస్త్రాలవల్ల కలిగినదెబ్బకు నింపమన్నాడు. లేదా అప్పుడే పుట్టి ఆహారం తీసుకొని గేదెదూడతొలిపుర్రును ఎండించిచేసిన చూర్ణం ఆయుధాల పుండుకుపుట్టిస్తే అది మానుతుందన్నాడు. ఈ రంగేలీ ఉన్నంత వరకూ అహల్య ప్రాణాలకేం ఢోకాలేదు కిష్ణయ్య!" అంది చాలా ఆత్మవిశ్వాసంతో.
తర్వాత ఆమె లోపలికి వెళ్ళీ మందులు తయారుచెయ్యడం మొదలెట్టింది.
ఈలోగా చలాన్ కట్టిండుదల అయి వచ్చేస్తారు రాత్రి రెయిడ్ లో పట్టుబడిన అమ్మాయిలంతా. చాలామంది అమ్మాయిలను వాళ్ళంటే ఇష్టపడే రెగ్యులర్ విటులేచలాన్ కట్టివిడిపించారు. కొంతమంది అమ్మాయిలు తమసొంత డబ్బుకట్టివిడుదలయ్యారు.
సొంతడబ్బు కట్టలేని వాళ్ళని మేడమ్ విడిపించడంవాడుక. తర్వాత ఆ డబ్బుని వడ్డీతో సహా ఈ అమ్మాయిలు తీర్చాలి. అలాంటి యువతులు మాత్రం అహల్య కోర్టుకి రానందువల్ల విడుదలకాలేక అక్కడే ఉండి పోయారు.
వాళ్ళందరూ తిరిగి రాగానే పెద్ద గందరగోళం మొదలయింది. పొడుచుకోవడాలు, చంపుకోవడాలూ, నేరాలూ, ఘోరాలూ ఆ లోకలైతీలోవాళ్ళకి కొత్తకాదు.
కానీ ఈసారి దారుణానికి గురి అయింది అహల్య! పవర్ ఫుల్ మేడమ్ అహల్య!
అందుకనే అంత సెన్షేషన్ క్రియేట్ అయింది అక్కడ.
"డాక్టరుని పిలవలేదేం?" అంది ఒకమ్మాయి.
"డాక్టరెందుకు? రంగేలీ ఉండగా? ఏదీ? రంగేలీ ఏదీ?" అన్నాడు ఇంకెవరో.
మాటల్లోనే రంగేలీ బయటకువచ్చింది. ఆమె చేతిలో మందులూ, ఒక బట్టా ఉన్నాయి.
గాయానికి మందువేసి కట్టుకట్టింది రంగేలీ. "ఒక్క ఇరవై నిమిషాల్లో చలనం వస్తుంది" అంది భరోసాగా.
అందరూ ఊపిరి బిగబట్టి చూస్తూ ఉండిపోయారు. గోడ గడియారంలో ముళ్ళు నెమ్మదిగా కదులుతున్నాయి.
ఇరవై నిమిషాలు గడిచాయి. కానీ అహల్య కళ్ళు తెరవలేదు.
అందరూ రంగేలీ వైపు ఆరోపణగా చూసారు.
అప్పుడు మొదటిసారిగా ఆందోళన కనబడింది రంగేలీ మొహంలో.
"న్యాయంగా చూస్తే ఈపాటికి మెలకువవచ్చి ఉండాలి. మరి ఎందుకని రాలేదో ఏమో?" అంది నీళ్ళు నములుతూ.
"రంగేలీదేం తప్పులేదు" అన్నాడు కిష్ణయ్య. "నేనువచ్చి చూసి అహల్య చచ్చిపోయిందని అనుకున్నాను. శ్వాసకూడా ఆడడంలేదు అలాంటి స్థితిలో వున్న మనిషిని బతికించడంమాటలా?" అన్నాడు.
"పెద్దడాక్టరుని పిలిపిస్తే?" అన్నారెవరో.
"పిలిపించాలి. ఇది హత్యకేసుకాబోతోంది." అన్నాడు కిష్ణయ్య.
ఆమాటలన్నీ సృజన చెవులకు వినబడుతున్నాయి.
అహల్య చనిపోతోంది. ఇది హత్య కేసు కాబోతోంది.
తను హంతకి కాబోతోంది!
సరిగ్గా తన పదమూడోఏట!
ఒక్కసారిగా దుఃఖంతో వెక్కిళ్ళు వచ్చాయి సృజనకి.
ఆ కదలికకి, ఆ పాత స్థంభానికి ఉన్న ఒక పేడు అప్పుడు కఠినంగా రూపుదిద్దుకుంటున్న ఆమె వక్ష స్థలానికి గుచ్చుకుంది.
సరిగ్గా గుండెల్లో ముల్లుగుచ్చుకున్నట్లు ఉంది ఆ పరిస్థితి!
"ఎవరన్నావెళ్ళి పెద్ద డాక్టరుని