అర్దరాత్రి ఆడపడుచులు 8
telugu stories kathalu novels books అర్దరాత్రి ఆడపడుచులు 8 "జలుబూ జ్వరం అన్నీ తగ్గిపోతాయ్! దెబ్బతో దెయ్యం దిగిపోతుంది. కదలకుండా కూర్చో!" అంది రంగేలీ. గిన్నెలోని రసాన్ని చేతిలోకి ఒంపుకుని సృజన మాడుకిఅంటుతూ. చాలా ఘాటువాసనవస్తోంది ఆ రసం.
"ఏమిటి రసం?" అంది సృజన ఏడుపుగొంతుతో.
తేలిగ్గా అబద్దం ఆడేసింది రంగేలీ. "అబ్బే! ఏం లేదు! ఉత్తసీకాయే! తొందరగాజిడ్డు వదుల్తుంది."
అపనమ్మకంగా మళ్ళీ గిన్నె వైపు చూసింది సృజన. తెరుచుకుని ఉన్న ఆమె కళ్ళలోకి పోయింది ఆ రసం. భగ్గున మండాయి కళ్ళు. బాధతో మూలుగు వెలువడింది.
ఆమె గొంతులో నుంచి. కళ్ళు గట్టిగా మూసేసుకుంది సృజన.
అప్పుడు వినబడింది గణగణమోగుతున్న గంట.
చెవులు రిక్కించి విన్నది సృజన. గంట మోగుతూనే ఉంది. అది మోగడం ఆగిపోగానే కొన్ని వందల పక్షులు ఒక్కసారిగా గాల్లోకి ఎగురుతూ కిలకిలా రావాలు చేస్తున్నట్లు శబ్దాలు. సృజనకు బాగా పరిచితమైనధ్వనులు అవి.
కొద్దిక్షణాల తర్వాత అర్ధం అయింది సృజనకి.
అవి పక్షుల అరుపులు కావు.
చీకూచింతాలేని చిన్న పిల్లలు పెడుతున్న కేకలు, కేరింతలు.
అక్కడికి దగ్గరలోనే స్కూలు ఏదో ఉండి ఉండాలి.
కళ్ళవెంబడి నీళ్ళు ధారాపాతంగా కారడం మొదలెట్టాయి సృజనకి.
ఆకన్నీళ్ళు రంగేలీ తలకు అంటుతున్నమందువల్లేకాదు. తను ఉన్న పరిస్థితిని తలుచుకుంటే కలుగుతున్న దుఃఖంవల్లకూడా.
ఆ పిల్లలందరిలాగా స్కూలుకి వెళ్ళి హాయిగా చదువుకుంటూ ఉండవలసిన తను, ఈ చెడ్డ మనుషుల మధ్య చిక్కుకుపోయింది.
ఎందుకిలా అవుతోంది? తనెప్పుడన్నా ఏదన్నా తప్పుచేసిందా? అందుకే దేముడికి కోపం వచ్చి ఇలాంటిపనిష్ మెంట్ ఇస్తున్నాడా?
మళ్ళీ గణగణ మోగింది గంట.
ఒక్కసారిగా పిల్లల బరువులు తగ్గిపోయాయి.
కొంచెంసేపటి తర్వాత నెమ్మదిగా గాలిలో తేలుతూవచ్చి నిలబడింది ఒక ప్రార్ధనా గీతం.
"విశ్వసృష్టి విధాయనం,
పునరేవపాలనతర్పరం...."
ఆపాట సృజనకి కూడా వచ్చు.
అప్రయత్నంగానే ఆమె పెదిమలు లయబద్దంగా కదలడం మొదలెట్టాయి.
పెదిమలు తెరిచి తెరుచుకోగానే మాడు మీద నుంచి చెంపల మీదుగా కారుతున్న మందు నోట్లోకి పోయింది. వెంటనే నోరూ, మనసూ కూడా చేదుగా అయిపోయాయి.
అప్పుడు గుర్తొచ్చింది సృజనకి.
ఇవాళనుంచి పరీక్షలు మొదలుతనకి. పెద్ద పరీక్షలు!
ఒక్కసారిగా గుండె ఆగిపోయినట్లయింది.
పరీక్షకి వెళ్ళడం లేదు తను. ఇక్కడ చిక్కుకుపోయింది.
అంటే ఈ సంవత్సరం ఫెయిలయిపోతుందన్నమాట!
ఆ ఆలోచనతోబాటు మరో భావన కూడా అస్పష్టంగా సృజన మదిలో మెదిలింది.
కేవలం స్కూలు పరీక్షలోనే కాదు. జెవెఇథమ్ అనే అతిపెద్ద పరీక్షలో కూడా అతి ఘోరంగా ఫెయిలయిపోతోంది తను.
స్కూలు పరీక్షల్లో ఫెయిలయితే మళ్ళీ రాయొచ్చు. పాసవచ్చు.
కానీ జీవితంలో ఫెయిలయితే?
వెన్నులో నుంచి చలిపుట్టుకొచ్చింది సృజనకి.
ఆమె తలమీద అరచేతితో దరువు వేస్తున్నట్లు అంటుతోంది రంగేలీ. మందు తాలూకు ఘాటువాసన మరీ ఎక్కువవుతున్నట్లు అనిపిస్తోంది.
మెల్లిగా మగత కమ్ముతున్నట్లు అనిపిస్తోంది సృజనకి. అమ్మే తన పుట్టినరోజుకి తలంటిపోస్తున్న భ్రాంతి అమృతహస్తాలతో అలవోకగా తల అంటుతూ ఆప్యాయంగా దీవెనలు అందిస్తుంది అమ్మ. 'అమ్మ కదుపు చల్లగా అత్త కడుపు చల్లగా.....గోనెడుమంది పిల్లల్నికని.....'
ప్రతి శుక్రవారం తలంటి పోస్తుంది అమ్మ. కుంకుడుకాయ నురుగు పోయి కళ్ళు మండి ఎర్రగా అయిపోతే అలా కళ్ళుమండేలా నురుగు పోసినందుకు తర్వాత తను అలిగికూర్చుంటే అమ్మ బతిమాలేది. "సారీ నాన్నా! ఈసారి ఇంకెప్పుడూ నురుగు కంట్లోకి పోనివ్వనుగా! ఈ మందు వేసుకో! కళ్ళమంట తగ్గిపోతుంది" అని కొద్దిగా చింతపండు, జీలకర్ర, ఉప్పు కలిపి ముద్దగా నూరి దాన్ని చిన్న ఉండచేసి ఒక పుల్లకి దాన్ని గుచ్చి ఐస్ ఫ్రూట్ లా తయారు చేసి ఇచ్చేది.
చప్పరిస్తూ ఉంటే పుల్లపుల్లగా, ఉప్పఉప్పగా మజామజాగా ఉంటుంది ఆ "మందు".
అదిమందుకాదని అమ్మకీ తెలుసు తనకీ తెలుసు.
కానీ బాధని మర్చిపోయేలా చెయ్యడానికి అది ఒక మంచి డైవర్షన్ ఆ "మందు" తనుతినేలోగా కళ్ళమంటలు ఎప్పుడు తగ్గిపోయేవో ఎలా తగ్గిపోయేవోగానీ మొత్తానికి తగ్గిపోయేవి.
'సైకలాజికల్ ట్రీట్ మెంటు అది. ఉత్తుత్తి ప్లాసెబో చక్కెర మాత్రలలాగా'అని నాన్నగారు ఒకసారి కామెంట్ చేసి నవ్వడం తనకు బాగా గుర్తుంది.
"ఇంకలే!" అంది రంగేలీ. ఉలిక్కిపడి ఆలోచనల్లో నుంచి బయటపడింది సృజన. తర్వాత కామాక్షికి తల అంటింది రంగేలీ. తలంట్లుపూర్తి అయి ఇంట్లోకి వచ్చాక" ఆ ఇనప్పెట్టె గదిలో మీ కోసం కొత్త బట్టలు ఉన్నాయి వేసుకోండి" అంది రంగేలీ.
గదిలోకి వెళ్లారు సృజనా, కామాక్షీ.
తనతడి వంటి మీదఉన్న చీరెను విప్పింది సృజన.
అప్పుడు వినబడింది బుసలాంటి శ్వాస.
కమ్చీతో కొట్టినట్లు ఉలిక్కిపడి తిరిగి చూసింది