అర్దరాత్రి ఆడపడుచులు 6
telugu stories అర్దరాత్రి ఆడపడుచులు 6 రంగేలీ నా! చాలా చిత్రమైన పేరు! ఇంతకీ ఎవరీవిడ? ఎక్కుడుంది తను? ఈ పసరు తనకెందుకు తాగిస్తున్నారు?
అప్పుడు మొదటిసారిగా గమనానికొచ్చింది సృజనకు. తనవళ్ళంతా క్లీన్ గా ఉన్నట్లు అనిపిస్తోంది ఎందుకని?
తనవైపు చూసుకుంది ఒకసారి.
వెంటనే షాక్ తగిలినట్లయింది.
చీరెకట్టివుంది తనకు!
వదులొదులు జాకెట్ వేసి ఉంది!!
కన్నుమూసి తెరిచేలోగా తన బాల్యాన్ని ఎవరో దోచుకుపోయినట్లు దిగులు కలిగింది సృజన.
ఎవరు కట్టారు ఇవి? ఈవిడేనా?
ఈవిడ....కాదు ఈయన.....కాదు.....ఈవిడ డాక్టరా?
అప్పుడు వినబడింది పక్కగదిలో నుంచి ఒక గొంతు టీచరు పిల్లలచేత వల్లె వేయిస్తున్నట్లు చెబుతున్నాడు ఎవరో?
"చెప్పవే! చెప్పు! బావా అమ్మ! బావా!"
"బావా!" అంది ఒక విచిత్రమైన గొంతు.
అది నిశ్చయంగా మానవకంఠం మాత్రం కాదు.
"నాచిట్టి చిలకపలుకులే! మరదలు పిల్లచేరెలోపల ఏం కట్టుకుంటుందీ? చెప్పు?"
"పెట్టికోట్!పెట్టికోట్!పెట్టికోట్!"
చిలకఅలా గబగబా అనడంలోనే వేరే అర్ధం మోటుగా ధ్వనిస్తోంది.
గలగల నవ్వులు వినబడ్డాయి.
"ఏయ్ చిలకల చిన్నారావ్? ఏంటి కావాలీ? చెప్పు చిలకమ్మా?" అన్నాడు చిన్నారావు.
"పండుకొని పెట్టు! పండుకొని పెట్టు!"
మళ్ళీ ఉధృతంగా నవ్వులు.
"నిన్నూ...."అంది మధుమతి బెదిరింపుగా.
ఆ మధుమతి చిన్నారావుని కొట్టబోతున్నట్లు అతను తప్పించుకు పారిపోతున్నట్లూ శబ్దాలు, నవ్వులు. చిన్నారావు నవ్వు మొహంతో పరిగెత్తి గదిలోకి వచ్చాడు.
"రంగేలీ! రంగేలీ! మధుమతినా వెంటపడింది చూడు! దీని నోరూకాళ్ళూ పడిపోయేటట్లు మందోమాకో పెట్టరాదూ?"
"నాకెందుకూమందూ? ఆడోళ్ళనిచూస్తే