అర్దరాత్రి ఆడపడుచులు 11
telugu stories kathalu novels books అర్దరాత్రి ఆడపడుచులు 11
తర్వాత కామాక్షి వంతు వచ్చింది.
"అందరిలోకీ ముందు నువ్వే పరిగెత్తిపోయావు కదా! లేడిపిల్లలా చెంగు చెంగున గెంతుతూ! అవునా? రంగేలీ! ఈ అమ్మాయి జన్మలో ఇంకెప్పుడూ పరుగెత్తలేకుండా చెయ్యమని చెప్పు ఉస్మాన్ కి" అంది అహల్య.
ఏడుస్తున్న కామాక్షిని గుంజుకుంటూ తీసుకెళ్ళిపోయింది రంగేలీ.
ఇదంతా విభ్రాంతురాలయి చూస్తోంది సృజన.
తర్వాత చిన్నారావూ, కామాక్షీ వేసిన గావుకేకలు కొద్దినిమిషాల వ్యవధిలో వినబడ్డాయి.
భయంతో కడుపులో తిప్పినట్లయింది సృజన. వాంతి వచ్చినట్లయింది.
"నేను బాత్ రూంకి వెళ్ళాలి" అంది అహల్య.
పావుగంటతర్వాత తిరిగి వచ్చింది రంగేలీ. సృజనని తీసుకుని వెళ్ళింది.
ఉస్మాన్ ఎదురొచ్చాడు వాళ్ళకి. అతని చేతిలో ఒక గుడ్డ ఉంది. దానిలోచుట్టి ఉంది ఏదో. గుడ్డకి ఎర్ర మరకలు ఉన్నాయి. చూసుకోకుండా అతన్ని ఢీ కొట్టింది రంగేలీ. అతని చేతిలో ఉన్న గుడ్డ కింద పడిపోయింది అందులోనుంచి ఏవో బయటపడ్డాయి.
కళ్ళు చిట్లించి చూసింది సృజన.
అవేమిటో తెలియగానే ఆమెగుండె జల్లుమంది. కాలి బొటనవేళ్ళు రెండు!! ఎర్రటి గోలీల్లా నేలమీద దొర్లాయి. కామాక్షివి అయి వుండాలి!!
కామాక్షి ఇంక జన్మలో ఎప్పుడూ పరిగెత్తకుండా చెయ్యమని అహల్య ఆర్డరు ఇవ్వడం గుర్తు వచ్చింది సృజనకి! కడుపులో మెలిపడినట్లయింది. బాత్ రూంలోకి పరుగెత్తి వామిట్ చేసుకుంది సృజన.
ఆరోజు సాయంత్రం.
బలవంతంగా అభ్యంగన స్నానం చేయించారు సృజనకి. కొత్తబట్టలు కట్టబెట్టారు. సౌందర్యాధి దేవతలా అలంకరించారు.
శవానికి అలంకరణ చేస్తున్నట్లు అనిపిస్తోంది సృజనకి. తన సాటి పిల్ల కామాక్షికి పట్టినగతి తలచుకుంటే గుండె చెరువై పోతోంది. ఉస్మాన్ చేతిలోనుంచి జారిపడ్డ కామాక్షి బొటనవేళ్ళు కళ్ళముందు కదిలాయి. ఎక్కడుంది కామాక్షి? బాధకు మూర్చపోయి ఉంటుందా? లేక చచ్చిపోయి ఉంటుందా? తనకి పారిపోయే అవకాశం దొరికినా అహల్యని రక్షించడానికి తిరిగి రావడం తప్పయిపోయిందేమో అని నిన్నంతా మధనపడిందిగానీ తను చేసిందే కరెక్టు పని అని ఇవాళ తేలుతోంది.
తను ఎంత దూరం పోయినా తరిమితరిమి పట్టుకొచ్చిఉండేవాళ్ళు వీళ్ళు.
ఆ తర్వాత కామాక్షికి చేసినట్లు నిర్దాక్షిణ్యంగా.....
ఒళ్ళు గగుర్పొడిచింది సృజనకి.
"రతీదేవి చిన్నప్పుడు నీలాగే ఉండేదేమో!" అని మెటికలు విరిచి కణతలకునొక్కుకుని, "అహల్య అక్క పిలుస్తోంది పద!" అంది రంగేలీ.
"ఎందుకు?" అంది సృజన హీనస్వరంతో.
నవ్వింది రంగేలీ. "చాలా పెద్ద విశేషమే! ఇవాళ నుంచే మొదలు నీకు. ఒకాయనవచ్చి కూచున్నాడు గదిలో నీకోసం!"
సృజనకి ప్రాణం చచ్చిపోయినట్లు అనిపించింది. ఈ బతుకుతనకి రాసి పెట్టిఉంది. తప్పదు.
ఇద్దరూ అహల్య దగ్గరికివెళ్ళారు.
"సృజనా! నువ్వుస్ సంతోషంగా ఉండాలి. అలా ఎప్పుడూ దిగులు మొహంతో ఉండకూడదు" అంది అహల్య. సృజన చుబుకంకింద చూపుడువేలుపెట్టి మొహాన్ని పైకెత్తుతూ.
మొహం పైకెత్తినా, కళ్ళు కిందికి దించుకుంది సృజన.
ఆయన ప్రత్యేకం నీ కోసమే వచ్చారు. అంది అహల్య మృదువుగా.
అతిప్రయత్నంమీద కళ్ళు ఎత్తి అహల్యవైపూ ప్రాధేయపూర్వకంగా చూసింది సృజన.
"వద్దు! ప్లీజ్! నాకు భయం భయం!" అంది ఆఖరిప్రయత్నంగా.
"భయమే ఉండదు. ఆయన చాలామంచివాడు. నెమ్మదిగా చెప్పి అన్నీ నేర్పిస్తాడు. నాలుగురోజులు గడవనీ, నువ్వు గురువుని మించిన శిష్యురాలివి అయిపోతావు" అంది అహల్య నవ్వుతూ.
పైకిరాబోతున్న దుఃఖాన్ని మింగేసి