అర్దరాత్రి ఆడపడుచులు 10

By | November 29, 2019
telugu stories kathalu novels books అర్దరాత్రి ఆడపడుచులు 10 నగ్నదేహాల వ్యాపారం జరిగి ఆ ఇంట్లో స్వార్ధం దిగంబర నృత్యం చెయ్యడం మొదలెట్టింది. ప్రతివాళ్ళు కూడా, ఎవరి సంగతి వాళ్ళు చూసుకుంటున్నారు. కానీ ఎవవ్రూ ఆలోచించనది సృజన సంగతి. అహల్య గనక చనిపోతే, ఉన్న సాక్ష్యాధారాల ప్రకారం ఆ పదమూడేళ్ళ పసిపాప హంతకి అవుతుంది. అక్కడ అహల్యకి ఎగశ్వాస రావడం మొదలెట్టింది. అహల్యకు సహాయం చెయ్యబోయి తిరిగివచ్చి సంకెళ్ళ వాతబడ్డ సృజన, గుంజకు కట్టివేయబడ్డ దూడలా సాయంత్రం దాకా అలాచాలా ఇబ్బందికరమైన పొజిషన్ లో స్థంభాన్ని వాటేసుకున్నట్లు నిలబడే ఉంది. తాగడానికి గుక్కెడు నీళ్ళయినా ఎవరూ ఆమెకు ఇవ్వలేదు. ఏడవడానికి కూడా ఆమెకింక ఓపికలేదు. బాధకీ, భయానికీ అతీతంగా అయిపోయింది తన మనసు. ఆ సాయంత్రం జేగురురంగులో గడ్డకట్టిన రక్తపు మడుగులో పడిఉన్న అహల్యమీదకి వంగి చూస్తోంది రంగేలీ. ఆమె ఎడమచేతిలో అహల్య చెయ్యి ఉంది. అప్పటిదాకా బలహీనంగా కొట్టుకుంటున్న అహల్య నాడికొద్దిగా మెరుగవడం గమనించింది రంగేలీ. ఆ తర్వాత కొద్ది క్షణాలకే మెల్లగా కళ్ళుతెరిచింది అహల్య. వెంటనే రంగేలీ మొహంచాటంత అయింది. "అక్కా!" అంది ఆత్రంగా. బదులు పలక్కుండా బలహీనంగా చూసింది అహల్య. అప్రయత్నంగానే ఆమెకళ్ళు మళ్ళీ మూతలుపడిపోయాయి. కొద్దిసేపు వేచి ఉంది రంగేలీ. ఐదు నిమిషాల తర్వాత మళ్ళీకళ్ళు తెరిచింది అహల్య. అతికష్టంమీద పెదిమలు కదిలిస్తూ అంది. "సృజన ఏదీ?" "నిన్ను పొడిచి పారిపోబోతుంటే కానిస్టేబుల్ కిష్ణయ్య పట్టుకుని కట్టేశాడు". "వాడిబొంద! నన్ను చిన్నారావు...." ఆయాసమొచ్చి ఆగి, కొద్దిగా తేరుకున్న తర్వాత మళ్ళీ చెప్పింది అహల్య. "నన్ను చిన్నారావు పొడిచిపారిపోతుంటే ఈ పిల్లనాకు సహాయం చెయ్యడానికి తిరిగి వచ్చింది. తను కూడా పారిపోవడానికి వీలు ఉన్నా! ఏదీ ఆ పిల్ల ఎక్కడుంది?" "స్థంభానికి ఆనుకోపెట్టి సంకెళ్ళువేసి వెళ్ళాడు కిష్ణయ్య" "ఎక్కడికెళ్ళాడు?" "డాక్టరునితేవడానికి" అని వంగి రహస్యంగా అహల్యచెవిలో చెప్పింది రంగేలీ. పొద్దుననగావెళ్ళాడు అక్కా! తొందరగారావద్దని మరీ మరీ చెప్పింది భవాని! నువ్వు చావాలని కోరుకుంటున్నారు భవాని, మధుమతీ! నువ్వుపోతే తనే మేడమ్ కావచ్చని ఎవరికీవాళ్ళే దురాశపడుతున్నారు. "వీళ్ళదుంపనేను తెంపుతాను" అంది అహల్యలేని ఓపిక తెచ్చుకుంటూ. "నీకురాంబాణం లాంటి మందు వేశాను అక్కా! సాయంత్రానికి నువ్వు కోలుకుంటావని నాకు తెలుసు. ఆ సంగతి చెబితే వీళ్ళు ఇంకేదేదో చేసి నిన్ను చంపేస్తారని వాళ్ళతో చేరిపోయినట్లునటించి నీకు విషపు మందు ఎక్కించానని చెప్పాను. లేకపోతే నిన్ను బ్రతకనిచ్చేవాళ్ళు కాదక్కా!" అహల్య కోలుకుంటున్న సంగతి తెలియగానే అప్పటిదాకా వారసత్వపు పోరాటంలో మునిగివున్న మధుమతీ, భవాని వెలతెలాబోతున్న మొహాలతో తిరిగివచ్చారు. "లేచావా అక్కా! పొద్దుటినుంచి నీకోసం దిగులుపడి వచ్చి గంగ ముట్టుకోలేదు నేను" అంది మధుమతి నంగనాచిలా. "నువ్వుపడిపోతే నేనేచచ్చినంతపని అయింది అక్కా!" అంది భవాని కల్లిబొల్లి ఏడుపులు ఏడుస్తూ. విరక్తిగా ఒకసారి వాళ్ళవైపు చూసింది అహల్య. రంగేలీ మళ్ళీ ఇంకేదో మందుతెచ్చి, అది వేసి కట్టు కట్టింది అహల్యకు. నెమ్మదిగాలేచి కూర్చుంది అహల్య. ఆమె మధుమతిని. భవానీని చూస్తే వళ్ళు భగభగ మండుతోంది. పగబడితే తాచుపాములాంటిదే అహల్య. కానీ కేవలంరంగేలీ మాటలు ఆధారంగా ఆమె ఎవరిమీదా ఏచర్యా తీసుకోదలచుకోలేదు. ఎవరినీ తొందరగా నమ్మదు ఆమె. ఒకవేళ నమ్మకంకుదిరిందంటే మాత్రం నెత్తిన పెట్టేసుకుంటుంది. రంగేలీ అంత నమ్మదగ్గమనిషి కాదని అహల్యకు తెలుసు. అందుకని, బాధని పళ్ళబిగువున సహిస్తూనే ఎన్ క్వయిరీ మొదలెట్టింది. అక్కడున్నవాళ్ళలో అభం శుభం తెలియని ఆడపిల్లలు కొంతమంది ఉన్నారు. వాళ్ళు అబద్దాలు చెప్పరనీ చెప్పేంత ధైర్యం వాళ్ళకిలేదనీ తెలుసు అహల్యకి. వాళ్ళు చెప్పింది విన్న తర్వాత జరిగింది అంతా ఆమెకు పూర్తిగా అర్ధమయిపోయింది. చిలకలచిన్నారావు తనసొమ్మంతా దోచుకుని, తనమీద హత్యాప్రయత్నం చేసి కామాక్షితో సహా పారిపోయాడు. సృజన తనని ఆదుకోవాలనే ఆరాటంతో వెనక్కి తిరిగి వచ్చింది. అంతవరకూ తనకు తెలుసు. ఆ తర్వాత ఏం జరిగిందో ఇప్పుడు అర్ధమవుతోంది. తను చనిపోతాననే అభిప్రాయం కలగగానే ఇంట్లో పవర్ స్ట్రగుల్ మొదలయింది. పవర్ ని ఆశించింది ముఖ్యంగా ఇద్దరు---మధుమతీ, భవాని, వాళ్ళకి తోడుగా కిష్ణయ్య ఉన్నాడు. రంగేలీ తనకు అపకారంచేసే మనిషి కాదు. కానీ నిలకడలేనిమనిషి ఎప్పుడూ గెలిచే పార్టీవైపే ఉండాలనే మనస్తత్వం. అయితే. రంగేలీని తను వదులుకోలేదు. ఆమె ఉంటే ఈ ఇంట్లో ఆడపిల్లలకి రోగాలు రావు. కడుపులూ రావు. ఆమె ఉంటే ఈ ఇంటికి వేరే డాక్టరు కూడా రానవసరంలేదు అలాగే---- కిష్ణయ్యని కూడా వెళ్ళిపొమ్మని చెప్పలేదు తను. కిష్ణయ్యను వెళ్ళమంటే పోలీసులతో తగువులను రారమ్మని బొట్టెట్టిపిలవడమే అవుతుంది. ఇకపోతే--- మధుమతీ, భవాని తిరుగుబాటుదారులు వాళ్ళు వయసుముదిరినవేశ్యలు, వాళ్ళతోతనకింక పనీలేదు. వాళ్ళని వదిలించుకోవడం మంచిది. కానీ ఆ వదిలించుకోవడం ఎలా ఉండాలి? ఇకముందు ఈ ఇంట్లోని ఏ ఆడదానికి తోకాడించే ధైర్యం లేకుండా--- అందరికీ హెచ్చరికగా ఉండేవిధంగా

ఉచితంగా చదవగలిగిన భాగం పూర్తయినది. పూర్తి కథను చదవడానికి ప్యాకేజీ తీసుకోండి

కథను కొనుగోలు చేయండి

 
You must be logged in to view the content.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *