అందమైన మాయ 51
telugu sex stories అందమైన మాయ 51 అమ్మడానికైతే నిశ్చయించుకున్నాడు కానీ ఎక్కడికి తీసుకెళ్లాలో, ఎంత ధనం అడగాలో తెలియరావట్లేదు పెంచలయ్యకి. రోజూ సెలయేటి ఒడ్డున కూర్చుని విగ్రహాన్ని తుడిచి చూసుకుంటూ కూర్చుంటున్నాడు. విగ్రహం చాలా విలువైనది అని అనిపిస్తోంది అతడికి. ఓ వైపు దానిని తీసుకెళ్లి గుడిలో వదలిరావాలి అనే ఆలోచన వస్తోంది. మరోవైపు చెడతిరుగుతున్న తన కొడుకు, నిస్సహాయంగా వున్న తన కోడలు, మనుమలు గుర్తొస్తున్నారు. ఈ ఆలోచనల్లో వుండగానే ఉన్నట్టుండి గొడ్లు బెదరినట్టు శబ్దాలు చేశాయి. వాటిని సముదాయిస్తుంటే కారుచీకట్లు కమ్మేసాయి.
ఆ రోజు గ్రహణం అని గుర్తొచ్చింది పెంచలయ్యకి. ఇల్లు కదలకుండా వుండాల్సింది అనుకుంటూ గొడ్లని తీసుకుపోయి చెట్టుకి కట్టేశాడు. మళ్ళీ విగ్రహాన్ని చేతిలోకి తీసుకొని చూస్తున్నాడు. విగ్రహం నుంచి ఓ వెలుగు రేఖ బయల్దేరినట్టు అనిపిస్తే నిలువుగుడ్లు పడిపోయాయి పెంచలయ్యకి. తను మేల్కొని వున్నాడా, కలగంటున్నాడా అని గిచ్చి చూసుకున్నాడు. ఏదైతే అది అయిందనుకొని వెలుగు రేఖ వెంబడి నడుచుకుంటూ పోయాడు. చుట్టుపక్కల ఎక్కడా చూడట్లేదు పెంచలయ్య. నేలమీద కనిపిస్తున్న వెలుగురేఖ చూసుకుంటూ నడుస్తున్నాడు.
చివరకు కాళ్ళకి మెట్లు తగిలేసరికి తలెత్తి చూశాడు. శిధిలావస్థలో వున్న ఓ దేవాలయం కనిపించింది. చేతిలో వున్న విగ్రహం బరువెక్కినట్టు అనిపిస్తే దానిని ఆ మెట్ల మీద పెట్టాడు. బెరుగ్గా నడుచుకుంటూ లోపలికి వెళ్ళి చూశాడు. దేవాలయ నిర్మాణంలోని సుందరత్వాన్ని గమనించే స్థితిలో లేడు పెంచలయ్య. నోరు తెరుచుకొని అక్కడ నిలబడి వున్న విగ్రహాలను చూస్తున్నాడు. చేతికి దగ్గరలో వున్న ఓ విగ్రహానికి పట్టి వున్న బూజును దులిపాడు. అది శివుడి విగ్రహమని తోచింది అతడికి. మామూలు రాతి విగ్రహంలా