అందమైన మాయ 2
telugu stories kathalu novels అందమైన మాయ 2 Coins తోనూ, పేకముక్కలతోనూ చిన్న చిన్న ట్రిక్స్ చేసి చూపించింది ఆ అమ్మాయి. ‘ఎలా వున్నాయి?’ అని నవ్వుతూ అడిగింది. బాగానే వున్నాయి అని మొహమాటానికి చెప్పబోయి కిరీటి ఎందుకో ఆగిపోయాడు. ‘మీరేమీ అనుకోనంటే, అంత ఇంప్రెసివ్ గా అయితే ఏమీ లేవండి’ అన్నాడు మెల్లిగా.
తనేమన్నా అనుకుంటుందేమో అని apprehensiveగా తననే చూస్తున్నాడు. ఆ అమ్మాయి మటుకు అలా ఏమీ అనుకోకుండా కొంత తీక్షణంగా ఆలోచించి కిరీటి వంక చూసి ‘అయితే ఇదుగో మీకోసం ఒక నిజమైన మ్యాజిక్ ట్రిక్. A serious trick for a serious man’ అంది. కిరీటికి బుర్ర తిరిగిపోయింది. ఆ రోజుల్లో పెంచలాపురంలాంటి పల్లెటూళ్ళో అమ్మాయిలు చదువుకోవడమే ఒక గొప్ప విషయం. అలాంటిది ఈ అమ్మాయి ఇంగ్లిష్ ఇంత అలవోకగా మాట్లాడేసరికి stun అయిపోయాడు. దానితోపాటు ఇప్పుడు చేయబోయే సీరియస్ ట్రిక్ ఏమై వుంటుందా అని చూస్తున్నాడు.
ఆ అమ్మాయి చేతిలో మళ్ళీ పేకముక్కల deck వున్నది. దానిని చాలా వాటంగా shuffle చేసి బల్లపై పెట్టింది. కిరీటి కళ్ళల్లోకి చూస్తూ ‘ఈ deck లో ఒక చిన్న లోపం వుంది. అదేమిటో చూసి నాకు చెప్పు. నీకెంత టైమ్ కావాలంటే అంతా టైమ్ తీసుకో’ అని తన కుర్చీలో జారగిలబడి కూర్చుంది. ఆ అంగట్లో కిరీటి కూర్చోడానికి వేరే కుర్చీ లేదు. నిలబడే ఆ పేక ముక్కల్ని చేతిలోకి తీసుకొని పరీక్షగా చూశాడు. ముందు ముక్కల్ని లెక్కపెట్టాడు. 53 ముక్కలు వున్నాయి అందులో. 52 ముక్కలు కాక ఒక జోకర్ కూడా వున్నదని తోచింది కిరీటికి. ఇక వెనక్కు తిప్పి ముక్కల్ని తేరిపార