అమ్మాయి ప్రేమ పరిణయం 9
telugu stories kathalu novels అమ్మాయి ప్రేమ పరిణయం 9 "లేదు సంజయ్ నేను ఇప్పుడు రాను. నేను చెప్పేది జాగ్రత్తగా విను. ఆల్రెడీ మనం సబ్మిట్ చెయ్యాల్సిన పాజక్ట్ డిటయిల్స్ మన కాంపిటీటర్ కంపనీ వాళ్ళ దగ్గరకి ఈ పాటికి చేరిపోయి ఉంటాయి. ఇప్పుడు వాళ్ళు అవే సబ్మిట్ చేస్తారు. మన టర్న్ వాళ్ళ తరువాత వస్తుంది కాబట్టి మనం దీన్నే సబ్మిట్ చేస్తే మనం వాళ్ళ దాన్ని కాపీ కొట్టాం అనే అవకాశం వాళ్ళకి ఉంటుంది. అందుకే నువ్వు మన టీం తో కాంఫరెంస్ పెట్టి వాళ్ళకి సిట్యుయేషన్ చెప్పి ఉన్న ప్రాజక్ట్ లో ఏమైనా చేంజెస్ చెయ్యగలరేమో కనుక్కో. అంతే కాకుండా మన దగ్గర ఉన్నది ఫైనల్ వర్షన్ కానీ మన టీం దగ్గర ఆ ప్రాజక్ట్ మొదలు పెట్టినప్పటినుండి ఇప్పటిదాకా మనం ప్రాజక్ట్ కంప్లీట్ చెయ్యడానికి చేసిన రఫ్ వర్క్ అంతా అన్ని వర్షంస్ ఉండే ఉంటుంది అవి కూడా నువ్వు కలక్ట్ చేసుకొని వాటిని ప్రింటౌట్ తీసుకొని