అమ్మాయి ప్రేమ పరిణయం 8
telugu stories kathalu novels అమ్మాయి ప్రేమ పరిణయం 8 కొంత సేపటి తరువాత ఆమె సద్దుకుంది. కళ్ళ నుండి కారిన నీళ్ళని తుడుచుకొని రక్తం కారిన చోట కర్చీఫ్ తో అద్దుకుంది. ఆమె దగ్గర ఉన్న వాటర్ బాటిల్ తో ఒకసారి మొహం కడుక్కుని బొట్టు పెట్టుకుంది. ఏడవడం వల్ల మొహం జిడ్డుగా ఉందేమో అని ఒకసారి బండి అద్దం లో మొహం చూసుకుంది. అతను కొట్టిన చెంప అంతా ఎర్రగా కందిపోయి అతని చేతి వేళ్ళ గుర్తులు ఆ చెంప మీద మిగిలిపోయాయి. పెదివి దగ్గర కొంచం ఉబ్బినట్టుగా ఉంది. అది చూస్తూనే ఆమెకి మళ్ళీ అతని మీద కోపం వచ్చింది.ఆమె కోపంగా "అసలు వీడు మనిషి కాదు....ఛ...కనపించిన వాళ్ళందరినీ కొట్టడమే పనిగా పెట్టుకున్నట్టున్నాడు.. రోడ్డు మీద జనాలని కొట్టడం తప్పు పనిగా కనిపించదు గానీ దాన్ని నేను ఆపానని నాకు మాత్రం వార్నింగ్ ఇచ్చాడు. నేనేదో వీడి వార్నింగ్ కి భయపడతాననుకున్నట్టున్నాడు. నా సంగతి వీడికి తెలీదు" అనుకుంటూ బండి తీసి స్టార్ట్ చేసింది. అసలే బండి డ్రైవింగ్ కొత్త