అమ్మాయి ప్రేమ పరిణయం 58
telugu stories kathalu novels అమ్మాయి ప్రేమ పరిణయం 58 "ఏంటి అక్కడ వర్క్ చెయ్యడం నచ్చలేదా యశ్ కమ్యూనికేషన్స్ లో వర్క్ చెయ్యాలని ఎంత మంది అనుకుంటారో తెలుసా అలాంటిది అక్కడ వర్క్ చెయ్యడం నచ్చకపోవడం ఏంటి నిజం చెప్పు నీ గురించి నాకు తెలుసు మొన్నటి దాక ఇబ్బంది లేనిది ఇప్పుడు సడెంగా అక్కడ వర్క్ చెయ్యడం నీకు ఇష్టం లేనంత గా ఏం మారింది. అయినా ఆ జాబ్ నీకెంతో ఇంపార్టెంట్ అని చెప్తూ ఉంటావుగా మరి అలాంటిది సడెంగా రిజైన్ చెయ్యడమేంటి" అన్నాడు సంజయ్
"అప్పుడు నచ్చింది ఇప్పుడూ నచ్చలేదు అందుకే రిజైన్ చేసాను" అంది
"అది కాదు చరిత ఇలా సడెంగా రిజైన్ చేస్తే ఎలా నీకు చాలా ఇబ్బంది అయిపోతుందేమో" అంది చరిత ముక్త కి నచ్చచెప్తూ
"ఏం కాదు అయినా ఇప్పుడేమయ్యిందని ఈ జాబ్ కాకపోతే వేరే జాబ్ చూసుకుంటాను కంప్లీట్ గా వర్క్ చెయ్యడం మానేస్తా అని చెప్పట్లేదు గా ఈ కంపెనీ లో మానేసాను అంతే" అంది
"ఏంటే అసలు నీకేం పట్టనట్టు అంత సింపుల్ గా చెప్తున్నావు" అంది సారిక
"మరి కాక ఏడుస్తూ కూర్చోమంటావా" అంది ముక్త
"ముక్త" ఆమె చెప్పిన సమాధానానికి కోపంగా అరిచింది చరిత
"మరి లేకపోతే ఏంటే నచ్చలేదు అని నేనెంత చెప్తున్నా మీరు వినిపించుకోవట్లేదు" అంది ముక్త
"అది కాదే ఇలా మధ్యలో మానేస్తే నీకు ఇబ్బంది కదా" అని ముక్త ని కన్విన్స్ చెయ్యడానికి ట్రై చేసింది సారిక
సంజయ్, చరిత, సారిక ఎంతగా నచ్చచెప్దామని ట్రై చేసినా తను వినలేదు
"అయినా నేను డెసిషన్ తీసేసుకున్నాను ఇంక ఆ టాపిక్