అమ్మాయి ప్రేమ పరిణయం 57
telugu stories kathalu novels అమ్మాయి ప్రేమ పరిణయం 57 ఆమె లోపలికి వెళ్ళేటప్పటికే యశ్వంత్ చాలా సీరియస్ గా వర్క్ చేసుకుంటున్నాడు. ఆమె గొంతు సవరించుకొని "సార్" అని పిలిచింది
అతడికి వినిపించిందో లేదో తెలియదు గానీ తలెత్తి మాత్రం చూడలేదు
ఆమె "సచ్చినోడు కావాలనే పలకటం లేదు" అని తిట్టుకుంటూ మళ్ళీ "సార్" అని గట్టిగా పిలిచింది.
ఆ పిలుపుకి తలెత్తి చూసాడు. ఎదురుగా ముక్త కనిపించింది. అతడు అయోమయంగా కనుబొమ్మలు ముడిచి అతడి డెస్క్ దగ్గర ఉన్న క్యాలెండర్ ని పరిశీలనగా చూస్తున్నాడు.
అతను చేస్తోందేంటో ముక్త కి అర్ధం కాలేదు. మళ్ళీ పిలిచింది "సార్" అని
అతను ఆమె వైపుకి చూస్తూ ప్రశాంతంగా "నువ్వా....ఇవాళ సోమవారమా కానీ క్యాలెండర్ ఏంటి ఇవాళ మంగళ వారం అని చూపిస్తోంది" అన్నాడు
"తిక్కలోడు కావాలనే ఆడుకుంటున్నాడు" అనుకుంటూ ఆయన అన్న మాటలు పట్టించుకోకుండా
"నా క్యాబిన్ ఖాళీ గా ఉంది సర్ నా థింగ్స్ ఎక్కడున్నాయో చెప్తే కలెక్ట్ చేసుకొని వెళ్ళిపోతా" అంది సూటిగా
"వాటి గురించి నన్నడుగుతావేంటి అందరి డెస్క్ ల దగ్గరికి వెళ్ళి వాటిలో ఏమున్నాయో చూడడమే నా పని అనుకున్నావా" అన్నాడు కోపంగా
"సచ్చినోడు నేను అడుగుతోంది ఏంటి వీడు చెప్తోంది ఏంటి తిక్క తిక్కగా మాట్లడతాడేంటి" అనుకొని "పోని కనీసం అవి ఎక్కడున్నాయో చెప్తే" అంది నసుగుతూ
"ఉంటే నీ డెస్క్ లో ఉండాలి లేదంటే స్టోర్ రూం లో ఉండుంటాయి లేదంటే డస్ట్ బిన్ లో ఉండుంటాయి...అక్కడ చూసుకోవాలి అంతే గానీ నా క్యాబిన్ కి వచ్చి నన్ను