అమ్మాయి ప్రేమ పరిణయం 56
telugu stories kathalu novels అమ్మాయి ప్రేమ పరిణయం 56 నిద్రలో ఉన్న ముక్తకి అదే పనిగా ఫోన్ రింగ్ అవ్వడంతో మేలుకు వచ్చింది. ఇంత పొద్దున్నే ఎవరా అనుకుంటూ ఫోన్ లిఫ్ట్ చేసింది "హలో" అంటూ
"హే గుడ్మార్నింగ్ ఏంటి ఇంకా పడుకునే ఉన్నావా" అడిగాడు సంజయ్
"నిద్రపోతున్న వాళ్ళని లేపి పడుకునే ఉన్నావా అంటే ఏమనుకోవాలి"
అతను నవ్వుతూ "నేను ఇంకో అరగంట లో అక్కడ ఉంటాను రెడీగా ఉండు" అని ఫోన్ పెట్టేసాడు.
ఆమె సమాధానం ఇచ్చేలోపే ఫోన్ కట్ అయిపోవడంతో విసుగ్గా "రెడిగా ఉండా ఎందుకు మంచి నిద్ర పాడు చేసింది చాలక ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలని" అని తిట్టుకుంది ముక్త
"ఒసే ముక్త ఎక్కడికి వెళ్ళడం ఏంటే ఆఫీస్ కి వెళ్ళవా" అడిగింది అంతరాత్మ
"ఓ ఛ అవును కదా వెళ్ళాలి గా నా వస్తువులు తెచ్చుకోవడానికి అయినా రిజైన్ చేసాక కూడా కరెక్ట్ టైం కి ఏం వెళ్తాం కొంచం సేపు పడుకుందాం" అనుకుంది బద్దకంగా ఆవలిస్తూ
"నిద్ర పోయింది చాలు నిన్ననే వస్తా ఆఫీస్ కి అన్నావు ఇవాల్టి దాకా వెళ్ళలేదు అసలే ఆ యశ్వంత్ నీతో ఆడుకుంటున్నాడు ఇంక ఇవాళ కూడా లేట్ వెళ్ళావనుకో నిన్ను గేట్ లో నుండి కూడా లోపలికి రానీయడు నీ వస్తువుల తో సహా నీ అయి.డి. కార్డ్స్ కూడా ఇంక అక్కడే ఉండిపోతాయి ఆలోచించుకో" అంది అంతరాత్మ
"ఓ అవును కదా వారం క్రితం అవసరం ఉండి ఒరిజినల్ అయి.డి కార్డ్స్ ఆఫీస్ కి తీసుకెళ్ళా కదా అవి ఇంకా అక్కడే ఉన్నాయి. ఆ సచ్చినోడు ఇప్పటికే నా మీద కారాలు మిరియాలు నూరుతూ ఉంటాడు. ఇవాళ లేట్ వెళితే గేట్ లోకి కూడా రానీయడేమో ఎందుకొచ్చింది హ్యాపీగా సంజయ్ తో