అమ్మాయి ప్రేమ పరిణయం 54
telugu stories kathalu novels అమ్మాయి ప్రేమ పరిణయం 54 "భయపడాల్సింది ఏం లేదు మీ తాతయ్యకి జ్వరం వచ్చింది. నిన్నంతా నిన్ను ప్రణవినే కలవరిస్తున్నారు..నీకు నిన్ననే ఈ విషయం చెప్దామనుకున్నాను గానీ మామయ్యగారు చెప్పద్దు అనుడంతో ఆగిపోయాను"
నందిని చెప్పింది వినేసరికి యశ్వంత్ కి కంగారు ఎక్కువయ్యింది "ఏంటి...ఇప్పుడు ఎలా ఉంది...నేను ఇప్పుడే బయలుదేరుతాను" అడిగాడు ఆదుర్దాగా
"అహ వద్దు..నువ్వు ఇప్పుడు వస్తే నేను ఈ విషయం నీకు చెప్పానేమో అన్న అనుమానం వస్తుంది. ఆఫీస్ నుండి ఇంటికెళ్లేటప్పుడు మాములుగా తాతయ్య ని కలవడానికి వచ్చినట్టు రా"అంది
ఆవిడ అలా అనడంతో ఇంకేం అనలేక "సరే...ఇప్పుడు తాతయ్యకి ఎలా ఉంది"
"ఇప్పుడు పర్వాలేదురా బానే ఉన్నారు.. కానీ మీ తాతయ్య చెప్పిన విషయం ఏం చేసావు. ఆయన దాని గురించే ఎప్పుడూ ఎక్కువగా ఆలోచిస్తున్నారు" అడిగింది నందిని
యశ్వంత్ నిట్టూరుస్తూ "నేను సాయంత్రం వచ్చి అన్ని విషయాలు మాట్లాడతా పిన్ని. నేను వస్తున్న విషయం తాతయ్యకి చెప్పకు" అన్నాడు
"సరే మరి ఉంటాను" అని ఫోన్ పెట్టేస్తుంది
ఫోన్ పెట్తగానే అతని ఆలోచనలు ముక్త వైపుకి వెళ్ళాయి. ఇవాళ పొద్దున్నే వచ్చి థింగ్స్ అన్ని కలెక్ట్ చేసుకుంటా అని చెప్పింది కద మరి వచ్చిందా లేదా అని అనుమానంగా రఘురామయ్య గారిని అడిగాడు. ముక్త ఇంకా రాలేదని తెలియడంతో "ఆ రోజు అంత గట్టిగా మండే మార్నింగ్ వచ్చి థింగ్స్ కలెక్ట్ చేసుకొని వెళ్ళిపోతా అని చెప్పింది మరి అప్పుడే మధ్యాహ్నం అవుతోంది ఇవాళేంటి ఇంకా రాలేదేంటి . మే బీ తను తీసుకున్న డెసిషన్ మీద రీథింక్ చేస్తోందా ఏంటి అలా అయితే మంచిదే" అని అనుకుంటూ ఉండగా డోర్