అమ్మాయి ప్రేమ పరిణయం 45
telugu stories kathalu novels అమ్మాయి ప్రేమ పరిణయం 45 "అంతా బానే ఉందమ్మా రేపు సాయంత్రం డిస్చార్జ్ చేసేస్తారు" అన్నాడు. అప్పటికి ఆవిడ మనసు కుదుటపడింది. వాళ్ళ నాన్నగారికి కూడా తేలికగా అనిపించింది. ఆయనకి ఇలా హాస్పటల్ లో ఉండడం ఇష్టం లేదు ఇంకా ఎన్ని రోజులు ఉండాలా అని అనుకుంటూ బాధపడుతున్నారు అప్పటిదాకా. సంజయ్ రేపు డిస్చార్జ్ అనగానే ఆయనకి హాయిగా అనిపించింది. కొంతసేపు అక్కడ కూర్చొని బయలుదేరింది ముక్త. ఆమెతో పాటు సంజయ్ కూడా బయటకి వచ్చాడు.
"ఆఫీస్ కి లేట్ గా వెళ్ళావు గా ఏమైనా అన్నారా బాస్" అడిగాడు సంజయ్
"అదెప్పుడూ ఉండేదేగా కొత్తగా చెప్పడానికి ఏముంది"
ఆ మాటకి చిన్నగా నవ్వాడు సంజయ్
"నేను రేపు ఊరికి వెళ్తున్నాను"
"అదేంటి అంత సడెంగా పొద్దున్న కూడా చెప్పలేదు ఊరికి వెళ్ళే విషయం"
"అసలు ఈ వారం వెళ్దామనుకోలేదు కానీ పిన్ని ఫోన్ చేసి రమ్మంది ఎందుకో మరి తెలీదు"
"హ్మ్ం...సరే. టికెట్ బుక్ చేసుకున్నావా"
"లేదు ఇప్పుడు ఇంటికి వెళ్ళి బుక్ చేసుకుంటా ఇంకా చరిత వాళ్ళకి కూడా చెప్పలేదు."
"సరే"
"రేపు ఆఫీస్ కి వెళ్ళి అటు నుండి అటు వెళ్తా"
"ఓకే"
"సరే మరి బై" అని చెప్పి అక్కడనుండి వెళ్ళిపోయింది.
మరుసటి రోజు ఉదయం-
ఆ రోజు యశ్వంత్ ముక్త తో మాట్లాడదాం అనుకున్నాడు. ఇప్పటికే చాలా లేట్ అయ్యింది. తన కన్నా ముందు తాతయ్య మాట్లాడితే పరిస్థితి చెయ్యి జారిపోతుంది. అది జరగకూడదంటే తనే ముందు మాట్లాడాలి. ఆమెతో ఏం మాట్లాడాలో ఎలా మాట్లాడాలో నిన్నటి నుండి ఆలోచిస్తూనే ఉన్నాడు కానీ ఒక నిర్ణయానికి