అమ్మాయి ప్రేమ పరిణయం 40
telugu stories kathalu novels అమ్మాయి ప్రేమ పరిణయం 40 ఆమె అలా బయటకి వెళ్ళగానే "మరీ ఎక్కువ తిట్టేసానా" అని ఒక్కక్షణం ఆలోచించాడు యశ్వంత్. "ఆ అదేం లేదులే" అనుకొని ఏం చేస్తోందో చూద్దామని ఆమె వెనకే బయటకి వచ్చాడు.
ఆమె తన సీట్ దగ్గరకి వచ్చి చిర్రు బుర్రు లాడుతోంది. "మెంటలోడు...తిక్కలోడు...క్రాక్ ఫెలో....సాడిస్ట్... కొంచం కూడా జాలి లేకుండా ఎలా తిట్టాడో...ఇంత రాత్రి దాకా ఉండి పని చేసా అని లేకుండా నిద్ర పోతున్నావా అని నా మీదే సటైర్ ఒకటి ఆ మొహానికి..." అని పైకే తిట్టుకుంటోంది ఆఫీస్ లో ఎవ్వరూ లేరనే ధైర్యం తో.
ఇంతలో ఏదో తట్టినట్టు "కొంపదీసి నేను నిద్ర పోవడం చూసాడా" అని అనుమానమొచ్చింది ముక్త కి. "ఆ చూస్తే మాత్రం అంత సేపు సిస్టం ముందు కూర్చొని పని చేసి కళ్ళు స్ట్రైన్ అయ్యాయని ఒక రెండు నిమిషాలు పడుకుంటే దానికే కొంపలంటుకుపోయినట్టు ఇది నీ ఇల్లనుకొని నిద్ర పోతున్నావా అని వాడిష్టమొచ్చినట్టు చిందులు తొక్కుతాడా"
"ఏంటి రెండు నిమిషాలు మాత్రమేనా నువ్వు పడుకున్నది" అంది అంతరాత్మ
"నువ్వు నోరుముయ్యి. ఎప్పుడు చూడు వాడికే సపోర్ట్ గా మాట్లాడుతావు. నేను రోజు పదిన్నరకే పడుకుంటాను అలాంటిది ఇవాళ ఇంత సేపు మేలుకున్నాను అరే ఆ మాత్రం కళ్ళు మూతలు పడవా. ఎప్పుడు వాడినే సపోర్ట్ చెయ్యడం కాదు నా గురించి ఆలోచించు...అసలు నువ్వు నా పార్టీ యో వాడి పార్టీయో నాకు అర్ధమే కాదు...ఎప్పుడు బుర్ర లేని వాళ్లనే సపొర్ట్ చేస్తావు నువ్వు. అయినా ఒక్కసారి ఆలోచించావా ఇద్దరి క్లైంట్స్ కి సంబందించిన డాక్యుమెంట్స్ సాయంత్రం ఇచ్చి ఈ రోజే అయిపోవాలంటే ఎలా అయిపోతాయి...ఆ మాత్రం బుర్ర పని చేయదా వాడికి...ఎంత పని ఉంటుందో ఆ మాత్రం తెలీదా...అసలు వాడికి వర్క్ అసైన్ చెయ్యడమే రాదు...వాడసలు కంపెనీ సి.యి.ఓ ఎలా అయ్యాడో...అయినా పిచ్చి పట్టినట్టు అలా అరుస్తాడేంటి...తనని ఎవరు మేలుకొని ఉండమన్నారు ఆఫీస్ లో..అదేదో నేనే ఉండమన్నట్టు మాట్లాడుతున్నాడు. ఇందాక నాకేదో హెల్ప్ చెయ్యడానికి వచ్చినట్టు వచ్చి పక్కన కూర్చున్నాడు. కనీసం హెల్ప్ చేసాడా అంటే లేదు గుడ్లప్పగించి చూసాడు నేనేం చేస్తున్నానో అని...ఎక్కడ నేనేదో