అమ్మాయి ప్రేమ పరిణయం 4
telugu stories kathalu novels అమ్మాయి ప్రేమ పరిణయం 4 ముక్త రాకముందు ఎప్పుడైనా చరిత, సారిక బయటకి వెళ్ళాలనుకుంటే చరిత బండి మీద వెళ్ళిపోయేవాళ్ళు. ఇప్పుడు ముక్త కూడా ఉండడం తో ఒక్క బండి మీదే వెళ్ళడం కష్టం గా ఉంది. అదీ కాక ఎక్కడ ట్రాఫిక్ పోలిసులు పట్టుకుంటారో అని భయం గా కూడా ఉండేది. అందుకే ఇంక ఆటోలు, క్యాబ్ లలో వెళ్ళాల్సి వచ్చేది. అదీ ఇంకా కష్టమయ్యేది వాటికి అయ్యే ఫేర్ లని చూసి. అందుకే ముక్త ఒక బండి కొనాలని అనుకుంది. అదే విషయం సంజయ్ తో చెప్తే అతను ముక్త కి ఒక మంచి బండిని చూపించాడు. దాన్ని కొనడానికి సహాయం చేశాడు. ఆ బండి ఇంటికొచ్చాక ముక్త బండి నడపడం నేర్చుకుంటోంది. ఈ మధ్యనే ఆమెకి లర్నింగ్ లైసెంస్ వచ్చింది.ఈ ఆరు నెలలలో ముక్త కి ఆఫీస్ లో యశ్వంత్ అన్న పేరు ఆఫీస్ స్టాఫ్ నుండి చాలా ఎక్కువగా వినబడుతోంది. అతను చాలా స్ట్రిక్ట్