అమ్మాయి ప్రేమ పరిణయం 37
telugu stories kathalu novels అమ్మాయి ప్రేమ పరిణయం 37 ఆ ప్రశ్నకి యశ్వంత్ చిన్నగా నిట్టూర్చాడు తనకి తాతయ్యకి మధ్య జరుగుతున్న విషయాలన్నీ క్లుప్తంగా చెప్పాడు. అంతా విన్నాక సంజయ్ అడిగాడు "మరిప్పుడేం చేద్దామనుకుంటున్నావు"
"అదే నాకర్ధమయితే ఇంత బాధ ఎందుకు" అన్నాడు యశ్వంత్
"అసలింతకీ ఆ అమ్మాయెవరు"
"ఎవరూ అంటే ఇప్పుడు చెప్పలేను తరువాత చెప్తా" అని మాట దాటేశాడు సంజయ్
"మరి ఈ సమస్యకి పరిష్కారమేంటి"
"అదే తెలియట్లేదురా.. ఏం చెయ్యాలో అర్ధం కావట్లే దాని గురించే ఆలోచిస్తున్నా"
డిన్నర్ అయిపోవడంతో సరే పద బయలుదేరదాం అన్నాడు సంజయ్. దారిలో అడిగాడు "నిన్ను ఆఫీస్ లో దింపేయనా..." అన్నాడు
"ఇప్పుడు ఆఫీస్ కి వెళ్ళి కార్ తీసుకొని ఇంటికి వెళ్ళేంత ఓపిక లేదురా..ఇంటి దగ్గర డ్రాప్ చేసేయి. రేపు పొద్దున్న బ్రేక్ ఫాస్ట్ కి ఇంటికొచ్చేయి అక్కడ నుండి కలిసి వద్దాం ఆఫీస్ కి" అన్నాడు
"ఇంకో కార్ ఉంది కదరా" అన్నాడు సంజయ్
యశ్వంత్ సంజయ్ వైపు ఆశ్చర్యంగా చూస్తూ "ఏంటి విషయం" అడిగాడు
"అది కాదు రా ముక్త ని పిక్ చేసుకుంటా కదా అని లేకపోతే తను బండి లో రావాల్సొస్తుంది" అన్నాడు
"ఓ అయితే మీ ఫైర్ బ్రాండ్ కి పిక్ అండ్ డ్రాప్ సర్వీస్ నీదే అనమాట. తనని ని పిక్ చేసుకోవడానికి వీలు కాదని రేపు రానంటావు అంతేనా ఇది మరీ టూ మచ్ అనిపించట్లే" అన్నాడు నవ్వుతూ
"అలా ఏం కాదులేరా...అయినా తనని అలా అంటావేంట్రా పాపం తను చాలా మంచిది"
"నేను కాదన్నానా ఏంటి. నన్ను ఆఫీస్ లో దింపేయి" అన్నాడు యశ్వంత్.
మరుసటి రోజు ఉదయం ఏడింటికే చరిత రెడీ అయిపోయింది. అప్పుడే లేచిన ముక్త "అదేంటి అప్పుడే రెడీ అయిపోయావు"
"నిన్న చెప్పా కదే అప్పుడే మర్చిపోయావా.."
"ఓ...అవును కదా మర్చిపోయాను" అంది
"అలాగే ఇవాళ సాయంత్రం పార్టీ గురించి కూడా మర్చిపోయా అన్నావో చంపేస్తా"
"అబ్బా లేదు లే గుర్తుంది" అంది
"సరే అయితే నేను సారికా సాయంత్రం నాలుగింటికే