అమ్మాయి ప్రేమ పరిణయం 35
telugu stories kathalu novels అమ్మాయి ప్రేమ పరిణయం 35 వారం రోజులనుండి హైదరాబాద్ ఆఫీస్ కి వెళ్లకపోవడంతో ఆ రోజు ఉదయం తొమ్మిది గంటలకే ఆఫీస్ కి వెళ్ళిపోయాడు యశ్వంత్. అతని క్యాబిన్ కి వెళ్ళడానికి రెండు దారులు ఉన్నాయి. ఒకటి నార్మల్ గా అడ్మినిస్ట్రేషన్ స్టాఫ్ వాళ్ళు ఉన్న ఫ్లోర్ నుండి వెళ్ళి అతని క్యాబిన్ కి వెళ్ళడం రెండోది ఆఫీస్ వనకవైపు నుండి వెళ్ళడం. సాధారణంగా అతను రెండోదే వాడతాడు. ఎప్పుడో గానీ స్టాఫ్ ఉన్న ఫ్లోర్ లోకి రాడు. అందుకే అతను ఆఫీస్ కి వచ్చింది రానిది ఎవరికీ తెలీదు ఒక్క రాఘవరావు గారికి సంజయ్ కి తప్ప. రాఘవరావు ఆయన పి.ఏ కాబట్టి అతనికి తెలుస్తుంది. యశ్వంత్ తో ఉన్న చనువు వల్ల సంజయ్ కి తెలుస్తుంది. యశ్వంత్ అతని క్యాబిన్ లోకి వెళ్ళేటప్పటికే అతని క్యాబిన్ మీద ఈ వారం రోజుల్లో వాళ్ళ కంపెనీ వాళ్ళు ఏ ఏ కంపెనీస్ తో డీల్స్ ఒప్పుకున్నారో వాటికి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ పెట్టి ఉన్నాయి. అవి కాకుండా అతను సైన్ చేయాల్సిన డాక్యుమెంట్స్ కూడా ఒక పక్కగా అతని డెస్క్ మీద పెట్టి ఉన్నాయి. అతను వాటిని పరిశీలిస్తున్నాడు. అన్నీ డాక్యుమెంట్స్ ఉన్నాయి కానీ ఒక రెండు డాక్యుమెంట్స్ మిస్ అయినట్టు ఉన్నాయి అవి కనిపించట్లేదు మే బీ అవి సంజయ్ కాబిన్ లోనే ఉన్నాయేమో అనుకుని సంజయ్ ని ఇక్కడికి తీసుకొని రమ్మని చెప్దామని అతని క్యాబిన్ కి కాల్ చేసాడు యశ్వంత్. యశ్వంత్ కాల్ చేసేటప్పటికే అక్కడ క్యాబిన్ లో సంజయ్ తో పాటు ముక్త కూడా ఉంది. ఏదో డాక్యుమెంటేషన్ విషయం లో ముక్త కి డౌట్స్ వస్తే సంజయ్ హెల్ప్ చేస్తున్నాడు. ఇంతలో క్యాబిన్ లో డెస్క్ మీద ఉన్న ఫోన్ రింగ్ అవ్వడంతో ముక్త కి ఎక్స్ప్లైన్ చేస్తున్నది ఆపి ఫోన్ లిఫ్ట్ చేసి "హలో