అమ్మాయి ప్రేమ పరిణయం 33
telugu stories kathalu novels అమ్మాయి ప్రేమ పరిణయం 33 "మీ గొడవ ఆపి అక్కడ చూడండి ఆ స్విమ్మింగ్ పూల్ ఎంత అందంగా ఉందో" అంది చరిత తను చూస్తున్న వైపు వేలు పెట్టి చూపిస్తూ.
చరిత చూపించిన వైపు చూస్తూ "వావ్..నిజంగా సూపర్ గా ఉంది." అంది సారిక
"అయినా ఎంట్రెంస్ కి దగ్గరలో ఆ స్విమ్మింగ్ పూల్ ఏంటే" అంది ముక్త
"ఒసేయి నిన్ను చూడమన్నది స్విమ్మింగ్ పూల్ నైట్ విషన్ లో ఎంత అందంగా ఉందో చాడమని... అంతే కానీ అది ఎంట్రంస్ కి దగ్గరగా ఉందా దూరం గా ఉందా..ఎంట్రంస్ దగ్గర ఎవరు కట్టారు ఎలా కట్టారు...అంటూ దాని పుట్టు పూర్వత్తరాలు ఆరా తీయమని కాదు" అంది చరిత విసుగ్గా.
"అబ్బా సరేలే తల్లి బుద్ది తక్కువయి అడిగాను వదిలేయి" అంది ముక్త.
ముగ్గురూ ఎంట్రెంస్ దగ్గరున్న మెట్లెక్కి లోపలికి వెళ్ళారు. రిసెప్షన్ లాగా చాలా పెద్ద హాల్ ఉంది అక్కడ. ఆ హాల్ కి వాడిన ఫ్లోరింగ్ ఇంకా అందంగా ఉంది. ఫ్లోరింగ్ మధ్యలో పూలతో అలంకరించారు ముగ్గు లాగా వేసి. అక్కడ గెస్ట్ లు కూర్చోవడానికి సోఫాలు ఉన్నాయి. వాటి ఎదురుకుండానే రిసెప్షనిస్ట్ ఉంది. వాళ్ళు అవన్నీ దాటుకొని రెస్టారెంట్ ఉన్న ఫ్లోర్ కి వెళ్ళారు. అక్కడ ఆంబియంస్ వాళ్ళకి బాగా నచ్చింది. లోపలికి అడుగుపెట్టగానే ఎర్ర రంగు కార్పెట్ ఉంది. దాని మీద అడుగు వేస్తుంటే ఏదో పెద్ద భవనం లోకి వెళ్తున్న అనుభూతి. అక్కడ ఎ.సి నుండి వచ్చే చల్లదనంలో ఏదో పరిమళం ఉంది. అది వాళ్ళని బాగా ఆకట్టుకుంది. అప్పిటిదాక ఉన్న అలసట పోయింది. అక్కడ లైట్లు ఎక్కువగా లేవు చాలా డిం లైట్స్ ఉన్నాయి. అక్కడ టేబుల్స్ అన్నీ ఖాళీగానే ఉన్నాయి గానీ ఆ ఖాళీగా ఉన్న టేబుల్స్ లో చాలా చోట్ల రిజర్వడ్ అన్న బోర్డ్ ఉంది. అది చూసి అంది చరిత