అమ్మాయి ప్రేమ పరిణయం 31
telugu stories kathalu novels అమ్మాయి ప్రేమ పరిణయం 31 గుడి నుండి బయలుదేరి ఇంటికి రాకుండా సరాసరి వెంట్రామయ్య గారింటికి వెళ్ళారు రఘుపతి గారు. వెంకట్రామయ్య గారు రఘుపతి గారు చిన్నప్పటి స్నేహితులు. ఒకే ఊళ్ళో హై స్కూల్ దాకా చదువుకున్నారు. ఆ తరువాత కూడా వాళ్ళ స్నేహాన్ని వదులుకోలేక ఒకే కాలేజ్ లో చేరారు. చదువయిపోయాక ఇద్దరికీ గవర్నమెంట్ జాబ్ వచ్చింది. కానీ రఘుపతి గారు ఎక్కువ రోజులు ఆ ఉద్యోగం చెయ్యలేదు. ఆయనకి బిజినెస్ మీద మక్కువ ఎక్కువ. అందుకే రెండు మూడు సంవత్సరాల తరువాత ఆ జాబ్ నుండి బయటకి వచ్చారు కానీ వెంకట్రామయ్య గారు రిటైర్ అయ్యేవరకూ అక్కడే జాబ్ చేసారు. రిటైర్ అయ్యాక ఒక ఇండిపెండేంట్ ఇల్లు కొడుకు ఆఫీస్ కి దగ్గరలో ఆయన పేరు మీద కట్టించుకొని అక్కడే ఉంటున్నారు కొడుకూ కోడలితో కలిసి. వాళ్ళిద్దరి దారులు వేరైనా ఒకరికి ఒకరంటే ప్రేమా, గౌరవం, అభిమానం ఉన్నాయి. రఘుపతి గారు ఎంత బిజినెస్ పనుల్లో ఉన్నా వీలైనప్పుడల్లా ఆయన్ని కలుస్తూ ఉండేవారు. రఘుపతి గారి అంతస్తు వాళ్ళిద్దరి స్నేహానికి ఎప్పుడూ అడ్డు కాలేదు. వెంకట్రామయ్య గారికి ఒక్కడే కొడుకు. అతని పేరు హరినాధ్ అతడి భార్య పేరు నందిని. వాళ్ళిద్దరికీ ఒక కొడుకు, కూతురు. పేరు హరీష్ వాడికి పాతికేళ్ళు ఉంటాయి. పూణే లో ఉద్యోగం చేస్తున్నాడు. కూతురు సౌజన్య డిగ్రీ ఆఖరి సంవత్సరం చదువుతోంది. రఘుపతి గారు గేట్ తీసుకొని లోపలికి వచ్చేటప్పటికి ఆయనకి నందిని ఎదురయింది. "మావయ్యగారు మీరా...రండి రండి..ఎన్ని రోజులయ్యిందో మీరు వచ్చి" అంది సంబరంగా
"ఏమ్మా నందిని ఎలా ఉన్నావు" అడిగారు రఘుపతి గారు.
"బావున్నానండి...మీరు ఎలా ఉన్నారు"
"బావున్నానమ్మా...అవును మా వెంకట్ ఏడి కనిపించడం లేదు" అని అడిగారు
"మామయ్య ఏదో పనుండి బయటకి వెళ్ళారు. ఆయన వెళ్ళి కూడా