అమ్మాయి ప్రేమ పరిణయం 30
telugu stories kathalu novels అమ్మాయి ప్రేమ పరిణయం 30 ఇంటికొచ్చాక గానీ ముక్తకి గుండె దడ తగ్గలేదు. లోపలికి వస్తూనే మంచి నీళ్ళు తాగి తన రూం లోకి వెళ్ళి తలుపేసుకుంది. చరిత, సారిక ఇంటిలోకి వచ్చేటప్పటికే ఆమె తలుపు వేసుకోవడం కనిపించింది. దాంతో ఒకళ్ళకొకళ్ళు చూసుకొని "ఏమయింది దీనికి" అనుకున్నారు. సారిక తలుపు కొట్టబోతుంటే "వద్దు ఇప్పుడూ తనని డిస్టర్బ్ చెయ్యకు ఒక గంట పోనీ అప్పటికి అది తలుపు తీయకపోతే అప్పుడే మనం కలగజేసుకుందాం" అంది చరిత.
"సరే" అని తన ప్రయత్నం మానుకుంది సారిక.
"ఎంత ధైర్యం వాడికి ఉన్నది గుడిలో అని కూడా చూడకుండా అలా ప్రవర్తిస్తాడా. పైగా తప్పంతా నాదే అన్నట్టు మాట్లాడతాడా. ఆ రోజు నన్ను అంతగా అవమానించింది చాలలేదా. ఒక్కరోజు..ఒక్కరోజులో నా జీవితం ఎంత మారిపోయింది...ఇప్పుడిప్పుడే కొంచం ప్రశాంతంగా ఉందంటే మానిన గాయాన్ని మళ్ళీ రేపుతున్నాడు" ఆమెకి ఏడుపు వస్తోంది ఎంత ట్రై చేసినా తనని తాను సంభాళించుకోలేకపోతోంది.
"ముక్తా కూల్...ఏడవకు...ఎందుకంత ఆవేశపడతావు చెప్పు...ఎందుకు వాడి కోసం నీ కన్నీళ్ళు వేస్ట్ చేసుకుంటావు. వాడికి అసలు అంత సీన్ ఉందా... లేదు. వాడి గురించి తలచుకొని నువ్వు బాధ పడడం ఏంటి..నీ లాంటి అమ్మాయిని మిస్సయినందుకు వాడు బాధపడాలి...నీకేం ఖర్మ...ముందు ఆ ఏడుపు ఆపు..ఇందాకటి నుండి నీ ప్రవర్తన సారిక వాళ్ళకి అర్ధం కావడం లేదు. ఇంకా ఇలానే ఉన్నావంటే వాళ్ళు బాధ పడతారు అసలే ఇవాళ సారిక పుట్టినరోజు. పొద్దుటి నుండి ఫుల్ గా తిరగాలని నిన్నంతా ప్లాన్ చేసుకున్నారు మర్చిపోయావా. నువ్వు ఇలా డల్ గా ఉండి వాళ్ళని అప్సెట్ చేస్తావా...జరిగిందేదో జరిగిపోయింది అది అయిపోయింది ఆ చాప్టర్ ని ఎప్పుడో క్లోజ్ చేసేసావుగా మళ్ళీ దాని గురించి ఆలోచించడం నీ బుర్ర పాడు చేసుకోవడం వేస్ట్" అని అనునయించింది అంతరాత్మ ఆమెకి కూడా అది నిజమే అనిపించింది. ఛ అనవసరంగా వాళ్ళకి టెన్షన్ ఇచ్చాను అని కళ్ళు తుడుచుకొని మొహం కడుక్కొని బయటకి వచ్చింది.
ఆమె బయటకి రావడం చూసి సారిక, చరిత హమయ్య అనుకున్నారు. ఆత్రంగా ఆమె దగ్గరికి వెళ్ళి "ఏమయిందే నీకు మేమెంత భయపడ్డామో తెలుసా...గుడి నుండి అంత హడావిడిగా