అమ్మాయి ప్రేమ పరిణయం 27
telugu stories kathalu novels అమ్మాయి ప్రేమ పరిణయం 27 ఆ రోజు రాత్రంతా ముక్త అన్యమనస్కంగానే ఉంది. చరితతో కూడా సరిగ్గా మాట్లాడలేదు. ముక్త అలా ఎందుకుందో అర్ధం కాక చరిత రెండు మూడు సార్లు ఆమెని "ఏమయింది" అని అడిగింది కానీ ముక్త నుండి సరైన సమాధానం రాలేదు. డిన్నర్ కి రమ్మని చరిత పిలిచినా కూడా ఆకలి లేదు వద్దని చెప్పింది. ఆమెని అలా చూడలేక చరిత ముక్త దగ్గరికి వెళ్ళి ఆమె పక్కన మంచం మీద కూర్చొని "ఏమయింది ముక్తా వచ్చినప్పటి నుండి చాలా డల్ గా ఉన్నావు" అంటూ ఆమె భుజం మీద చెయ్యేసింది. చరిత అలా అడిగేసరికి చెప్పకుండా ఉండలేకపోయింది.
"చరిత నాకో హెల్ప్ చెయ్యగలవా"
"దానికి ఇంతలా అడగాలా ఏంటో చెప్పు"
"నాకు అర్జంట్ గా కొంత డబ్బు కావాలి సర్దగలవా"
"హా..ఎంత"
"అయిదు లక్షలు"
ఆ మాట వినగానే చరిత కళ్ళు తేలేసింది "ఏంటి అయిదు లక్షలా..అంత డబ్బెందుకే"
"పనుంది సర్దగలవా లేదా.."
"అయిదు లక్షలంటే చాలా కష్టం ముక్తా..నా దగ్గర మహా అంటే పాతిక వేలున్నాయేమో అంతకు మించి లేవు"
"పోనీ నీకు తెలిసిన వాళ్ళ దగ్గర"
"ఉహు..లాభం లేదు.." అని కొంచం సేపు ఆలోచించి "అయినా ఇంత ఆలోచన ఎందుకు సంజయ్ ని అడగొచ్చు కదా" అంది
"మధ్యాహ్నం నుండి అడుగుదామనే అనుకున్నాను కానీ కుదరట్లేదు. సాయంత్రం తనకి పని ఉందని చెప్పి నన్ను ఇంటికెళ్లిపోమన్నాడు సంజయ్. అతన్ని కలవడానికే కుదరలేదు. ఇందాక కూడా కాల్ చేసాను ఇంటికొచ్చాడేమో మాట్లాడదామని కానీ తనింకా ఇంటికి