అమ్మాయి ప్రేమ పరిణయం 22
telugu stories kathalu novels అమ్మాయి ప్రేమ పరిణయం 22సంజయ్ ఆశ్చర్యంగా "ఎందుకు" అన్నాడు ఏం తెలియనట్టు"ఎందుకేంటి యశ్వంత్ యాడ్ తీస్తున్నాడుగా అందుకే డేట్స్ ఇచ్చాను" అంది ఉక్రోషంగా. యశ్వంత్ ఈ విషయం తనకి అసలు తెలియనివ్వలేదు, అంతేకాదు తనంతట తనే వచ్చి సంజయ్ తో మాట్లాడుతుంటే అసలు అతను ఆ యాడ్ విషయాన్నే తన దగ్గర ప్రస్తావించట్లేదు దాంతో ఆమెకి చాలా ఉక్రోషంగా ఉంది అదంతా ఆమె మాటలలోనే కనపడుతోంది."ఓ అదా..నువ్వేం కంగారు పడకు ఆ యాడ్ కి నిన్ననుకోవట్లేదు" అన్నాడు కూల్ గ అంతే..అంత వరకూ బలవంతంగా కోపాన్ని ఆపుకొని సంజయ్ తో మాట్లాడుతున్న ఆకాంక్ష కి సంజయ్ అలా అనగానే కోపం వచ్చింది "అంటే""ఆ మాత్రం అర్ధం కాలేదా..ఆ యాడ్ కి మోడల్ ఫైనలైజ్ అయిపోయింది" అన్నాడు నవ్వుతూ."హౌ డేర్...నన్ను కాదని వేరే మోడల్ ని సెలక్ట్ చేస్తాడా యశ్వంత్. నాకు తెలిసినంత వరకూ యశ్వంత్ తీస్తున్న యాడ్ జ్యువెలరీకి సంబంధించింది. దానికి నేను సరిగ్గా సరిపోతాను ఆ విషయం యశ్వంత్ కి కూడా బాగా తెలుసు అయినా నన్ను కాదని వేరే మోడల్ ని అనుకుంటున్నారా. మీ యాడ్ రిలీజ్