అమ్మాయి ప్రేమ పరిణయం 21
telugu stories kathalu novels అమ్మాయి ప్రేమ పరిణయం 21 మధ్యాహ్నం అయ్యింది. ముక్త యశ్వంత్ తనని ఎప్పుడు పిలుస్తాడా అని ఎదురు చూస్తోంది. లంచ్ టైం దాటి గంటయిపోయింది కానీ యశ్వంత్ తనని పిలవలేదు. "ఇదేంటి ఇవాళ మధ్యాహ్నం లంచ్ తరువాత పిలుస్తాను రెడీగా ఉండమని చెప్పాడుగా నిన్న..మరి ఇంకా పిలవడేంటి" అనుకుంటూ చూస్తోంది. పొద్దున్న సంజయ్ తనకి వివరంగా చెప్పాక ఆమెకి విషయం పూర్తిగా అర్ధం అయ్యింది. నిన్న అనవసరంగా అంత గొడవ చేసినట్టున్నా అనుకుంది. పైగా అది జ్యువెలరీ యాడే కావడం, స్క్రీన్ పైన కనిపించాల్సిన అవసరం లేకపోవడంతో ఆమెకి అభ్యంతర పెట్టడానికి కారణం కనిపించలేదు. అది మాత్రమే కారణం కాదు నిన్న యశ్వంత్ ఇస్తానన్న అయిదు లక్షలు కూడా ఒక కారణం. అవి ఆ సమయం లో చేతికి వస్తే ఆమెకి చాలా హెల్ప్ అవుతాయి. ఆమెకున్న చాలా అవసరాలు తీరిపోతాయి. నిన్న మోడలింగ్ అనేసరికి తను ఏవేవో ఊహించేసుకొని భయపడింది కానీ ఇవాళ అంత భయపడాల్సిన అవసరం ఏమీ లేదని అర్ధమయ్యాక మనసు అటు వైపు మొగ్గు చూపుతోంది. యశ్వంత్ ఎంతకీ పిలవకపోవడంతో ఆమెకేం చెయ్యాలో అర్ధం కాలేదు. "కొంపతీసి నిన్న తను కాదంది కదా అని ఆ అవకాశం వేరే వాళ్ళకి ఇచ్చేయలేదు