అమ్మాయి ప్రేమ పరిణయం 18
telugu stories kathalu novels అమ్మాయి ప్రేమ పరిణయం 18 "అగ్రీమెంట్ నచ్చలేదు, నేను ఒప్పుకోను అంటే ఎలా కుదురుతుంది. నిన్న కూడా నాకు జరిగింది నాకు నచ్చలేదు మరి కానీ జరగాల్సింది నువ్వనుకున్నట్టు జరిగింది కదా మరి ఇదీ అంతే. అయినా నాకు జాలి ఎక్కువ కాబట్టి ఈ అగ్రీమెంట్ నీకు నచ్చలేదంటున్నావు కాబట్టి దాని సంగతి వదిలేయి. దానికి బదులు మోడలింగ్ చెయ్యి. సో అలా పర్వాలేదు. అలా అయినా నాకు కంపెంసేట్ చెయ్యొచ్చు ఏమంటావు" అన్నాడు కనుబొమ్మలు ఎగరేస్తూ. అతను అప్పటిదాకా ఆమెని ఈ విషయం అడగాలనుకోలేదు కానీ అనుకోకుండా అతని నోటి నుండి ఆ మాట వచ్చేసింది. కానీ అన్న మాటని వెనక్కి తీసుకోవడం ఇష్టం లేక ఊరుకున్నాడు.ఆ మాట వింటూనే ఆమెకి చాలా కోపం పెరిగిపోయింది. "వ్వాట్ ఏం మాట్లాడుతున్నావు నువ్వసులు. నేను మోడలింగ్ చెయ్యాలా. ఎలా కనిపిస్తున్నాను నేను నీ కంటికి. ఎంత నువు ఈ ఆఫీస్ కి సి.యి.ఓ అయినంత మాత్రాన నీ ఇష్టమొచ్చినట్టు ఏది పడితే అది మాట్లాడితే ఊరుకుంటాననుకుంటున్నావా. నీకు ఇవ్వాల్సిన బోడి రెండు లక్షల కోసం నన్ను మోడలింగ్ చెయ్యమంటావా. అది కూడా కంపేంసేషన్ గా. ఎంత నీకు డబ్బుంటే మాత్రం అవతల వాళ్ళని అంత చులకనగా చూస్తావా. ఇప్పటిదాకా నువ్వు తానా అంటే తందానా అనే వాళ్ళనే చూసుంటావు. నన్ను కూడా అలాగే భావించినట్టున్నావు. బట్ నేను అందరి లాంటి దాన్ని కాను. ఇంకోసారి ఇలాంటి ప్రపోజల్ తెస్తే మర్యాదగా ఉండదు" అంది అతనికివ్వాల్సిన గౌరవాన్ని కూడా వదిలేసి కుర్చీలోంచి