అమ్మాయి ప్రేమ పరిణయం 11
telugu stories kathalu novels అమ్మాయి ప్రేమ పరిణయం 11 ముక్త ఆ ట్రాఫిక్ లో బండి మీద ఇంటికెళ్ళేటప్పటికి గంట పట్టింది. అంత సేపు డ్రైవ్ చేసేసరికి చాలా అలసటగా అనిపించింది. ఇంట్లోకి వస్తూనే బ్యాగ్ ని ఒక పక్కన పడేసి సోఫా మీద కళ్ళు మూసుకొని పడుకుంది. ఆమె అలా సోఫా లో పడుకుందో లేదో ఈలోపే చరిత ముక్త వెనకగా వచ్చి "నీకసలు కామన్ సెన్స్ ఉందా లేదా.. ఇంటికి వచ్చేటప్పటికి లేట్ అయ్యేటట్టు ఉంటే ఒక్క ఫోన్ కాల్ అయినా చేసి చెప్పొచ్చు కదా. అసలు నీ ఫోన్ ఎక్కడ పెట్టావు ఇందాకటి నుండి ఫోన్ చేస్తుంటే నాట్ రీచబుల్ లేకపోతే స్విచాఫ్..ఈ రెండే తప్ప మూడో మాటే లేదు. అసలే మొదటి సారి బండి తీసుకొని వెళ్ళావు. పైగా సంజయ్ కూడా నీతో లేడు. మాకెంత కంగారుగా ఉంటుందో ఆలోచించావా. నీ పాటికి నువ్వు నీ ఇష్టమొచ్చినట్టు చేస్తున్నావు""అబ్బా ప్లీజ్... ఇంక తిట్టకే బాబు అసలే నాకు