అమ్మాయి ప్రేమ పరిణయం
telugu stories kathalu novels అమ్మాయి ప్రేమ పరిణయం సెల్ ఫోన్ లో పెట్టుకున్న అలారం మోగడంతో వెంటనే నిద్రపోతున్న ఆముక్త నిద్రనుండి లేచింది. లేచి జుట్టు సవరించుకుంటూ చుట్టూ చూసింది. ఇంకా చీకటి రేకలు పూర్తిగా తొలగిపోలేదు. అప్పటికే తను అనంతపురం నుండి ప్రయాణం చేస్తున్న బస్సు హైదరాబాద్ నగరం లోకి ప్రవేశించింది. బస్సు ప్రయాణం వల్ల తనకి రాత్రంతా సరిగ్గా నిద్ర పట్టలేదు. ఇదే తను మొదటిసారిగా హైదరాబాద్ రావడం. తను ఎక్కడ దిగాలో ఒకసారి నెమర వేసుకుంటూ తన సీట్ నుండి లేచి నెమ్మదిగా నడిచి వెళ్ళి డ్రైవర్ ని అడిగింది లకడీకపూల్ వచ్చిందా అని. ఇంకో పదిహేను నిమిషాలలో వస్తుందని డ్రైవర్ చెప్పడంతో తన సీట్ దగ్గరకి వెళ్ళి లగేజ్ తెచ్చుకొని ముందు సీట్ లో కూర్చుంది. బస్సు లకడీకపూల్ లో ఆగాక తన లగేజ్ తీసుకొని బస్సు దిగింది. ఆమెతో పాటు చాలా మంది ప్రయాణికులు దిగారు. అక్కడే ఉన్న ఆటో వాళ్ళు బస్సు ఆగడం తో ప్రయాణీకుల దగ్గరికి వచ్చి ఆటో లో వెళ్ళే వాళ్ళని ఎక్కించుకొని వెళ్తున్నారు. ఎక్కడికి వెళ్ళాలని అడిగిన ఇద్దరు ముగ్గురు ఆటో వాళ్ళకి ఏం సమాధానం చెప్పకుండా