విజయ్ ఒక భర్త కథ 13
telugu stories kathalu novels విజయ్ ఒక భర్త కథ 13 దాని గురించి ఆయన నన్నుఅడిగే సరికి సరికి ఏం చెప్పలేక తల దించుకున్నా.. హారిక ఒక్కసారిగా ఆ విషయం ఆయనకు ఎలా తెలిసింది. అనగానే విద్య ఆఫీస్ అకౌంట్ నుండి బుక్ చేసి ఉంటాడు వాళ్లు చెక్ చేయగానే దొరికిపోయాడు అని చెప్పగానే నేను కూడా అవునన్నట్టు తలూపాను.. అసలు విషయం ఏంటంటే ఆఫీస్ వాళ్లు వెళ్లి ఎయిర్ పోర్ట్ ఇమిగ్రేషన్ లో విజయ్ సార్ డీటెయిల్స్ గురించి అడిగితే వాళ్ళు టికెట్ బుక్ చేసుకున్న విషయం కరక్టే కానీ ఆయన ఇవాళ ట్రావెల్ చెయ్యలేదు అని చెప్పారట అందుకే కంగారుపడి వెంటనే ఇంటికి వచ్చేసాను అని చెప్పాడు గౌతం చెప్పిందంతా వినగానే హారికకు కంగారు వచ్చేసింది విజయ్ బాధతో ఉన్నాడని వెళ్తానంటే ఒప్పుకుంది కానీ ఇప్పుడు తనకు కాళ్లు చేతులు వణుకుతున్నాయి. అదేంటి వెళ్లక పోవడం ఏంటి పొద్దున మీ ముందే అన్నాడు కదా అని చెప్తూ ఉండగానే గౌతమ్ ఫోన్ రింగ్ రావడం చూసి ఈ మురళి గాడు ఒకడు పొద్దున్నుండి కాల్ చేస్తూనే ఉన్నాడు అనగానే హారిక విద్య గౌతమ్ వైపు చూస్తూ కోపంగా నీతో వాడికి ఏంటి పని అంటూ ఫోన్ లాక్కొని లిఫ్ట్ చేసి స్పీకర్ ఆన్ చేసి మాట్లాడమని గౌతమ్ వైపు సైగ చేసింది అవతల ఫోనులో మురళి గాడు విజయ్ గురించి అడగడం గౌతమ్ మొత్తం చెప్పేయడంతో వాడు చాలా హ్యాపీగా ఉన్నట్టు మాటలు వినబడుతూ ఫోన్ పెట్టేసాడు మొత్తం విన్నాక వాడి సంతోషాన్ని పసిగట్టిన హారిక ఛీ ఇలాంటి వాళ్ల కోసం విజయ్ ………………..ఇలాంటి దానికి దూరంగా ఉంటే కనీసం సంతోషంగా ఉంటాడేమో అని వెళ్లనిచ్చాను గాని ఇలా మనకి కూడా చెప్పకుండా ఎక్కడికో వెళ్లి పోతాడు అని అస్సలు అనుకోలేదు ఎక్కడికి వెళ్లి ఉంటాడు అని అనుకుంటూ విద్య తో ఒకవేళ వాళ్ల ఊరికి గాని వెళ్లి ఉంటాడా? అని అడగగానే విద్య వెంటనే వల్ల అత్త గారికి ఫోన్ చేసి విజయ్ గురించి అడగడంతో ఇక్కడికి రాలేదు అయినా రమ్య ను కనుక్కో లేదా