ఓం మహాద్భుతానందాయ నమ 1
telugu stories kathalu novels ఓం మహాద్భుతానందాయ నమ 1 “అక్కా. అక్కా. అక్కా.” గట్టిగా అరుస్తూ రమ్య పరుగు పరుగున ఇంట్లోకి వచ్చింది. తన భర్తతో ఫోన్లో మాట్లాడుతున్న రాధ ఆ అరుపుకి ముడుసుకుని రమ్య వైపు కోపంగా చూస్తుంది. “బావగారు ఫోన్ లో మంచి విశయం చెబుతుంటే ఎందుకే అలా అరుస్తున్నావు” కోపంగా అంటుంది రాధ.
“బావగారు చెప్పేవన్నీ మంచి విశయాలే గానీ.. నేను చెప్పేది దానికంటే మరింత మంచి విశయం.. చెబితే నువ్వు కళ్ళు తిరిగి పడిపోతావు..” ఆయాస పడుతూ చెబుతున్న రమ్య వంక ఆశ్చర్యంగా చూస్తూనే “.. ఆ..ఆ.. మీ మరదలు వచ్చిందండీ.. ఏదో విషషం చెబుతుందట.. మీరు చెప్పే విషయం కన్నా మంచిదిట.. అదేం చెబుతుందో విని మీకు మళ్ళీ కాల్ చేస్తాను..” అంటూ ఫోన్ కట్ చేసి రమ్య వైపు తిరిగి “ఆ.. ఇప్పుడు చెప్పవే.. ఏమిటా విషషం.. నీ మొహం వెలిగిపోతుందంటే.. ఏదో మంచి వార్తనే మోసుకొచ్చినట్టున్నావే..” అంది కుతూహలంగా..
రమ్య భుజాలెగరేస్తుంది. “అవునక్కా. చాలా మంచి వార్త..” “ఇంకా లేటెందుకు.. ఏమిటో చెప్పు..” ఆతృతగా అడుగుతుంది.
“అబ్బా.. మంచి వార్తని నీ ఒక్కదానితోనే పంచుకుంటే ఏం బావుంటుందే.. నలుగురితో పంచుకుంటేనే ఆనందం.. సంతోషం.. అందుకే.. పిలిచేయ్.. మీ చుట్టు పక్కల ఉన్న అమ్మలక్కలని పిలిచేయ్” రమ్య అలా అనడమే ఆలస్యం రాధ ఇంటి చుట్టూ ఉన్న అమ్మలక్కలు క్షణంలో ప్రత్యక్షం అయిపోతారు. దాంతో రమ్య అవాక్కయిపోతుంది.
“ఇంత ఫాస్ట్ గా వచ్చారేమిటీ..?” ఆశ్చర్యంగా అంటుంది. పావని, సరోజ విజ్జు ముగ్గురూ ఒకేసారి “మంచి విశయాలు వినడానికి లేటు చేస్తే లేటెస్ట్ ఛాన్సులన్నీ మిస్సవుతారని మీ అక్క