కాస్ట్లీ రొమాన్స్ 2
telugu stories kathalu novels కాస్ట్లీ రొమాన్స్ 2 ‘ఛీ… ఛీ…” తన ఆలోచనలకి తనే సిగ్గుపడింది శ్రీలక్ష్మి. గబ గబా స్నానం పూర్తి చేసుకుని బట్టలు మార్చుకుని బాత్ రూంలో నుండి బయటికి వచ్చింది. ఆమె బయటికి వచ్చేటప్పటికే చాలా సేపటి నుండి ఎదురు చూస్తున్నట్లు పనమ్మాయి కనిపించింది. ఆమెని చూడగానే సిగ్గు ముంచుకు వచ్చింది శ్రీలక్ష్మికి…. తన పిచ్చి ఆలోచనలతో బాత్ రూంలో దాదాపు గంటసేపు గడిపిందని అప్పుడర్థమయింది ఆమెకి… ఆమె సిగ్గు పడుతూ మెల్లిగా డైనింగ్ టేబుల్ దగ్గరకు చేరుకుంది.
పనమ్మాయి వేడి వేడి వంటకాలు ఒక ప్లేట్ లో వడ్డించింది. శ్రీలక్ష్మి వాటిని చూడగానే నోరూరింది. ఇంత వరకూ తనెప్పుడూ తినని వంటకాలు ఉన్నాయి. గబ గబా వాటిని ఆరగించే పనిలో పడింది శ్రీలక్ష్మి… పనమ్మాయి టి.వి. ఆన్ చేసి శ్రీలక్ష్మి తినే వరకు అక్కడే ఉండిపోయింది. భోజనం ముగించాక పనమ్మాయి అంతా సర్ది బయటికి వెళ్ళిపోయింది. కడుపు నిండగానే ఆమె కళ్ళకి నిద్రమత్తు ముంచుకు వచ్చింది. బెడ్ పైన నడుం వాల్చింది. మెత్తటి పరుపుపైన అలా పడుకుని ఎదురుగా టీవి చూస్తుంటే ఆమెకి ఎక్కడలేని ఆనందం పొంగుకు వచ్చింది. నిజంగా వాణి ఎంతో అదృష్టవంతురాలు….
”అతిథిగా వచ్చిన తనకే ఇంత ఆడంబరాలు ఉంటే… ఇంక వాణి ఈ ఇంటికోడలు కావడంతో మహారాణిలా ఉంటుంది కాబోలు…” అనుకుంది శ్రీలక్ష్మి. ఆమెకి మళ్ళీ రమేష్ గుర్తుకు వచ్చాడు. రమేష్ కూడా ఇక్కడికి వస్తే బాగుండును అనుకుంది శ్రీలక్ష్మి… వస్తే ఏం చేసే వాడు…? తన అందాలని కళ్ళ నిండా చూసుకుంటూ ఓ మూలకి కూర్చునే వాడు. అంతే కదా ఇప్పటి వరకు అతను చేస్తున్న పని…! చొరవగా తన దగ్గరికి వస్తే తనూరు కుంటుందా… ఒక్క తోపు తోస్తే వెన్నుపూస విరిగేలా క్రిందపడిపోతాడు. నవ్వుకుంది శ్రీలక్ష్మి ఆ