నిహారిక 2
telugu stories kathalu novels నిహారిక 2 సొంత స్నేహితుడు సురేష్ తో డబ్బు విషయంలో గొడవపడి అతని పతనం కోసం ఒక చిన్న ట్రిక్ ప్లే చేసి రాక్షసత్వంగా నవ్వుకునే డాక్టర్ రఘువీర్ ఎంతటి నయవంచకుడో ఈ సంఘటన ద్వారా తెలుస్తుంది. సురేష్ మంచి బిజినెస్ మ్యాన్. రఘువీర్, సురేష్ ఇద్దరూ ఎక్కడి కెళ్ళినా కలిసే వెళ్ళేవారు. రఘువీర్ లో ఉన్నది, సురేష్ లో లేని చెడుగుణాలు రెండున్నాయి. అవి మందు, మగువ. రఘువీర్ తను కోరుకున్న అమ్మాయితో కలవాలనుకున్నప్పుడు స్వయంగా సురేష్ ఆ అమ్మాయిని కాకాపట్టి రఘువీర్ దగ్గరకు తీసుకువచ్చేవాడు. అలాగని అతను చెడ్డవాడు కాదు. కేవలం రఘువీర్ పైన ఉన్న స్నేహభావంతో ఆ పని చేసేవాడు. సురేష్ కి మ్యారేజ్ అయ్యింది.
కానీ ఏనాడు రఘువీర్ ని సురేష్ తన ఇంటికి తీసుకువెళ్ళలేదు. కారణం రఘువీర్ మనస్తత్వం తెలిసినవాడు కాబట్టి. తన ఇంటికి తీసుకువెళ్తే తన భార్యని చూసికూడా ‘సొల్లు’ కార్చుకునే థర్డ్ క్లాస్ మెంటాలిటీ అతనిది. రఘువీర్ గురించి పూర్తిగా తెలిసినా ఒక స్నేహితుడిగా అతన్ని గౌరవంగానే చూశాడు సురేష్. చిన్నప్పటి నుండి ఇద్దరూ కలిసి తిరిగారు. ఎక్కడికి వెళ్ళినా ఇద్దరూ కలిసే వెళ్ళేవారు. అయినా రఘువీర్ లోని చెడుగుణాలకి మాత్రం సురేష్ ఎప్పుడూ దూరంగానే ఉన్నాడు.
రఘువీర్ ఎన్నిసార్లు సురేష్ తో మందు తాగించాలనుకున్నప్పటికీ ఆ ప్రయత్నాలెప్పుడూ ఫలించలేదు. సరిగ్గా అప్పుడే రఘువీర్ కి ఒకమ్మాయితో పరిచయం ఏర్పడింది. ఆమె చాలా అందంగా ఉంటుంది. రఘువీర్ ఆమెను చూసి నిజంగానే పిచ్చివాడైపోయాడు. ఆమె అందాలని జుర్రుకోవాలనే ఆశ రోజు రోజుకూ అతనిలో పెరిగిపోసాగింది. తనపై అతనిలో రగులుతున్న కోరికను కనిపెట్టి అతన్ని రెచ్చగొట్టే విధంగా