మొండి 61 మూసిన తలుపు
telugu stories kathalu novels మొండి 61 మూసిన తలుపు వీరు బయటకు వచ్చాక వందలాది విషయాలు మనస్సులో తిరుగుతున్నాయి... దివ్య, చైతన్య ని వీళ్ళ నుండి ఎలా కాపాడాలి.... చైతన్య ని ఉద్యోగం లోనుంచి బయటకు లాగి అజ్ఞాతంలోకి నెట్టాలి.. అలాగని అతని లైఫ్ డిస్టర్బ్ అవ్వకూడదు.. ఏమి చెయ్యాలా అని ఆలోచిస్తున్నాడు...
... తొందరపడకుండా... ఏదైనా సాలరి నిర్ణయం తీసుకోవాలి... దివ్యకి ఇబ్బంది రాకుండా చూసుకోవాలి...
దివ్య కి కాల్ చేసాడు వీరు...చాలా సేపు ట్రై చేశాక దివ్య నెంబర్ కలిసింది.... దివ్య నుండి మొదటి సారి విసుగు అలక కలసిన మాటలు వినిపించాయి... అర్జెంట్ గా దివ్య దగ్గరికి వెళదాం అనుకున్నాడు కానీ, ఇప్పుడున్న టాస్క్ చాలా పెద్దది....
" దివ్య...."
" ఏంటో చెప్పు... నేను నాన్నకు వంట చేస్తున్నా..."
" అర్జెంట్ గా ... నీ ఐపీ అడ్రస్ మార్చేయ్ ప్లీస్..."
" ఎలా మారుస్తాం.. దేనికి?"
తన లైఫ్ రిస్క్ లో ఉంది అని.చెప్పాలి కానీ, అది కరెక్ట్ కాదు...
" అది కాదు దివ్య.... ఆ లాప్ టాప్ వల్ల నీకు యాక్సిడెంట్ అయ్యింది"
" పిచ్చి ఏమన్నా ఉందా నీకు...లాప్ టాప్ వల్ల డేంజర్ ఏంటి?"
" ప్లీస్ దివ్య నేను చెప్పింది చెయ్... నేను హైదరాబాద్ వచ్చాక మాట్లాడతా."
" అవసరం లేదు..."
అని చెప్పేసి విసురుగా ఫోన్ పెట్టేసింది...
అసలే టెన్షన్... దానికి తోడు కడుపు మంట..... రాత్రి నిద్ర సరిగ్గా పోయి చాలా.రోజులు అయ్యింది...
లోపల సెల్ లో ఉన్న లహాజా దగ్గరికి వచ్చాడు....లహాజా అన్నం తింటూ